వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బాహుబలి...కానీ, నంద్యాలలో పోటీ ఎందుకు?: సోమిరెడ్డి

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అవినీతిలో బాహుబలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అవినీతిలో బాహుబలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలను సంధించారు. చంద్రబాబును తిడితే వైసీపీ బాగుపడుతోందని భావించడం మూర్ఖత్వమన్నారు.

వైసీపీ ప్లీనరీ తీరును చూస్తే సంప్రదాయాలకు భిన్నంగా ఉందన్నారు. నేరచరిత్రగల జగన్ సీఎం సీటులపై పిచ్చితో అబద్దాలు మాట్లాడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. బాబును తిట్టడానికి ఒక పార్టీ కోట్లు ఖర్చుపెట్టి రెండురోజులు ప్లీనరీ పెట్టాలా అని ఆయన ప్రశ్నించారు.

మూడేళ్ళ ఏపీ బడ్జెట్ రూ.3,60, 621 కోట్లన్నారు. మూడులక్షల కోట్ల అవినీతి ఎలా జరిగిందని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. అబద్దాల్లో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు.జగన్‌కు పిచ్చి నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

Ap minister Somireddy Chandramohan reddy slams on Ysrcp chief Ys Jagan

కాంగ్రెస్ పాలన నుండి వైజాగ్ భూముల విషయంలో ఏం జరిగిందో సిట్ తేల్చనుంద్నారు. ఎంసీఆర్‌బీ రిపోర్ట్ ప్రకారమే కాంగ్రెస్ పాలనలో 24వేల మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయాన్నారు. మళ్ళీ అదేపాలన తెస్తామనడం హస్యాస్పదమన్నారు సోమిరెడ్డి.

ఎన్నికల అఫిడవిట్‌లో బెంగుళూర్ ఇంటి గురించి చెప్పే ధైర్యం జగన్‌కు లేదన్నారు. సిబిఐకి ఎన్నికల అఫిడవిట్‌లో చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవాలని ఆయన విమర్శించారు. అవినీతిలో వైఎస్ జగన్ బాహుబలి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతిస్తున్న జగన్, నంద్యాల ఎన్నికల్లో టిడిపికి ఎందుకు మద్దతివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

English summary
Ap Agriculuture minister Somireddy Chandramohan reddy slams on Ysrcp chief Ys Jagan .He spoke to media on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X