మోడీ మా నాయకుడు...మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు...
అమరావతి: బిజెపి పై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శల వర్షం కురిపించి 24 గంటలైనా గడవక ముందే ఆ పార్టీ మంత్రి సోమిరెడ్డి అందుకు భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

బాబుకు వీర్రాజు ఊహించని షాక్! 2014లో చంద్రబాబు గెలిచేవారా ?
మోడీ తమ నాయకుడని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో తామూ మిత్రపక్షంగా ఉన్నామని, ఎన్డీఏలో తమ నాయకుడు మోదీ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ లాజిక్ తీశారు. అంతేకాదు పొత్తులపై మోదీ, అమిత్ షా, చంద్రబాబు మాట్లాడనే లేదు కదా..?

మరి సోము వీర్రాజు, రాజేంద్రప్రసాద్‌కు ఎందుకంత కంగారు? అని కూడా మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారానికి టీడీపీ-బీజేపీ కలిసి పని చేస్తాయని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నారని, ఆ విషయం కేబినెట్ భేటీలోనూ సీఎం చంద్రబాబు తమతో చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications