జగన్-రఘురామకు చెడింది అక్కడే-సీక్రెట్ బయటపెట్టిన మంత్రి..!
ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి, ఆరు నెలల్లోనే అధినేత జగన్ తో విభేధించి నాలుగేళ్ల పాటు పోరాటం చేసి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు రఘురామకృష్ణంరాజు. అయితే జగన్ కూ, ఆయనకూ మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియలేదు. కానీ ఇవాళ చంద్రబాబు కేబినెట్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రహస్యం బయటపెట్టారు.
ఇవాళ కృష్ణాజిల్లాలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తన మాజీ బాస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓటేస్తే, రాష్ట్ర ప్రజలకు నరకయాతన చూపించాడన్నారు. గతంలో 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. జగన్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి, నలుగురు నాయకులు చేత కథ మొత్తం నడిపిస్తాడని సుభాష్ వెల్లడించారు.

గతంలో రఘురామ కృష్ణం రాజు తనను సార్ అని సంభోదించలేదని, జగన్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అని ఆయనపై కక్ష పూరితంగా వ్యవహారించాడంటూ అసలు నిజం బయటపెట్టారు. 2024 ఎన్నికల ముందు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని కబురు పంపారని, ఆ సందర్భంలో అక్కడే ఉన్న ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేయాలని ఆదేశించాడని సుభాష్ తెలిపారు.

జగన్ కు సాష్టాంగ నమస్కారాలు ఇష్టమని, మీ కులానికి సంబంధించిన మంత్రి కూడా అదే చేస్తారని ధనుంజయరెడ్డి తనకు చెప్పినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. తనకు మతిపోయి తింగరి చూపులు చూసి వెనక్కి తిరిగి వచ్చేసానన్నారు. ఆరోజు ఎమ్మెల్సీ పదవి కోసం సాష్టాంగ నమస్కారాలు చేసి ఉంటే ప్రజలు తనను రాళ్లు పెట్టి కొట్టేవారన్నారు. వైసీపీ పార్టీలో కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తే, తన పైన కేసులు పెట్టేవారని గుర్తుచేసుకున్నారు.
మరోవైపు 11 సీట్లకే పరిమితం అయ్యేసరికి జగన్ మానసిక వ్యాధికి గురయ్యారంటూ మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ మందులు వికటించాయి కాబట్టే, ఎన్నికల తర్వాత పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు.మగవాళ్ళు అందంగా ఉంటారు అని పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు. ఇదేవిధంగా కొనసాగితే పిచ్చి ఆస్పత్రికి తరలించడం ఖాయమన్నారు. కుటుంబ ఆస్తి కోసం, సొంత కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి జగన్ అని సుభాష్ ఆరోపించారు. చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకు ఇవ్వకుండా దెబ్బలాడుతున్నాడన్నారు. చంద్రబాబు లాంటి మహనీయులైన వ్యక్తి పుట్టినరోజు నాడు, జగన్ గురించి ప్రస్తావించడం రావడం దౌర్భాగ్యం అంటూ ముగించారు.












Click it and Unblock the Notifications