అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కనుసన్నల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు.. చేసింది టీడీపీ గుండాలే.. ఏపీ మంత్రుల ఆరోపణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Capital Farmers Protest : Exclusive Video Of Nara Lokesh Arranged Gundas For Protest

అమరావతి రైతులకు చేసిన మోసం బయటపడుతుందన్న భయంతోనే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని, ఆయన కనుసన్నల్లోనే టీడీపీ గుండాలు.. తమ ప్రజాప్రతినిధులపై దాడులకు దిగుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పామర్పు ఎమ్మెల్యే అనిల్ కుమార్ లపై జరిగిన దాడుల్ని వైసీపీ ఖండించింది.

డిప్యూటీ సీఎం అంజద్ బాషా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం చేయించిన చంద్రబాబు తీరు అత్యంత హేయమైందని, దాడులు చేస్తోన్న టీడీపీ గుండాలకు, వాళ్లను నడిపిస్తోన్న చంద్రబాబుకు ప్రజలే బుధ్ది చెబుతారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికే రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు హింసకు పాల్పడుతున్నారని, దీనికిగానూ చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి సురేశ్ హెచ్చరించారు. అసెంబ్లీ కొలువై ఉన్న ప్రాంతంలోకి ఎమ్మెల్యేలను రానీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమని, రైతుల ముసుగులో టీడీపీ గుండాలే దాడులకు పాల్పడుతున్నారని మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉండే ఏపీలో హింసకు పాల్పటం ద్వారా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, జరుగుతున్న ఉదంతాలే అందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి చెప్పారు. బాబు రాక్షస విధానాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

AP Ministers and Leaders Condemns Attacks On YSRCP MLAs

రాజధానిని తరలించొద్దంటూ అమరావతి రైతులు 21 రోజులుగా దీక్షలు చేస్తున్నా.. మంగళవారం మాత్రం నిరసనల్లో హింస చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా చినకాకాని హైవే వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ల రామక్రిష్ణా రెడ్డిని అడ్డగించిన నిరసనకారులు ఆయన కారును ధ్వంసం చేశారు. కృష్ణా లో జరిగిన మరో ఘటనలో పామర్రు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను రైతులు ఘెరావ్ చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల్ని అడ్డుకుటున్నది రైతులు కారని, టీడీపీ గుండాలేనని అధికార పక్షం ఆరోపిస్తోంది.

English summary
AP Ministers accused that Chandrababu Naidu wantedly creating Unrest situation In the state and Condemns Attacks On both YSRCP MLAs on tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X