చంద్రబాబును పవన్ భేటీ - ఇదీ కారణం: వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. రాజకీయంగా ఈ భేటీ ఆసక్తి కరంగా మారింది. టీడీపీ - జనసేన పొత్తుల ప్రచారం వేళ..భవిష్యత్ కార్యాచరణ పైన ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పొత్తు ఖాయమని భావిస్తున్నా..ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. బీజేపీ స్టాండ్ పైన క్లారిటీ కోసమే ఈ ఇద్దరు నేతలు వెయిట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు - పవన్ భేటీ పైన వైసీపీ నేతలు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ లో చంద్రబాబు - పవన్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీ పైన వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబు ఈ భేటీ పైన ట్వీట్ చేసారు. సంక్రాంతికి అందరింటికీ గంగిరెద్దులు వెళ్తాయని.. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడు డూడు బసవన్నలా తల ఊపడానికి..అంటూ ట్వీట్ లో విమర్శించారు. మరో మంత్రి అమర్నాధ్ వీరిద్దరి భేటీ పై ట్వీట్ ద్వారా స్పందించారు.సంక్రాంతి మమూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు అంటూ కామెంట్ పోస్టు చేసారు. మరో మంత్రి కారుమూరి వీరద్దిరి భేటీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

దత్త తండ్రి ఇంటికి వచ్చిన దత్త పుత్రుడు.. సొంత కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసుకోవటం కోసం అద్దె కొడుకుని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతున్న 44 ఏళ్ల ఇండస్ట్రీ..అంటూ ట్వీట్ చేసారు.
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలిగిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తారనే తాము పవన్ ను దత్తపుత్రుడు అంటామని చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడు అంటే చెప్పు తీసుకొని కొడతానని పవన్ అంటున్నారని.. ఎవరిని కొట్టాలో ఇప్పుడు పవన్ సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు.

2014లో వీరి పొత్తుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసారని ఆరోపించారు. ఏపీలో జారీ అయిన జీవో గురించి పక్క రాష్ట్రంలో కూర్చొని చర్చించటం ఏంటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ఒక స్టాండ్ లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇక, టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని..ఇందులో కొత్త విషయం ఏమీ లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో ప్రజలు మరోసారి మోసపోవటానికి సిద్దంగా లేరని మంత్రి చెల్లబోయిన వేణు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications