• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎమ్మెల్యేలకు మీరంటే భయం లేదు: మీకు ఆ అలవాట్లు లేవు: సీఎం జగన్‌తో మంత్రులు!

|

అవినీతి నియంత్రణలో మంత్రులంతా మీకు భయ పడుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు..అధికారుల్లో మాత్రం మీరంటే ఇంకా భయం లేదని..పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసారు. చిన్ని చిన్న పోస్టుల విషయంలో కూడా మంత్రుల మాటకు విలువ ఉండటం లేదని వాపోయారు. అన్ని పాఠశాలల్లోనూ తెలుగు తప్పని సరి చేయాలని సీఎం స్పష్టం చేసారు. సెకండ్ లాంగ్వేజ్ అనటం కంటే తెలుగు తప్పని సరి అంటూ ఆదేశాలివ్వాని నిర్ధేశించారు. ఇక, మధ్య పాన నిషేధం విషయంలో మంత్రులు..సీఎం మధ్య ఆసక్తి కర చర్చ సాగింది. మద్య నిషేధం ప్రభావం పర్యాటక శాఖ మీద పడుతుందనే చర్చలో భాగంగా.. మంత్రి అవంతి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సీఎం గారూ..మీకు ఆ అలవాటు లేదు. మీరంటే శ్రీరామచంద్రుడు..సత్యహరిహ్చంద్రుడు కాబట్టి మీకు ఆలోచించరు అంటుండగానే.. మీరంతా కూడా శ్రీరామచంద్రులు కావాలి అంటూ సీఎం వ్యాఖ్యానించారు.

మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..

ఎమ్మెల్యేలకు భయం లేదు..

ఎమ్మెల్యేలకు భయం లేదు..

కేబినెట్ అధికారిక చర్చ ముగిసిన తరువాత మంత్రులు రాజకీయంగా పలు అంశాలను సీఎం వద్ద ప్రస్తావించార. జూనియర్ లైన్ మెన్లు విషయంలో నియామక అధికారాలను ఇన్ ఛార్జ్ మంత్రులకు ఇవ్వాలని కొందరు మంత్రులు ప్రతిపాదించారు. సీఎం మాత్రం పారదర్శకంగా ఉండాల్సిందేనని..సాధ్యం కాదని తేల్చేసారు. పార్టీ శ్రేణుల నుండి ఒత్తిడి ఉందని..ఎక్కడా అవకాశం లేకపోతే ఇబ్బందిగా ఉందని చెప్పుకొచ్చా రు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అంటే భయం రావటం లేదని మంత్రులు ఫిర్యాదు చేసారు. తనకు ఎక్కడ ఏం జరుగుతుందో..అన్నీ తెలుసని..ఎక్కడా అవినీతి జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

మద్యం గురించి..మీకు..ఆ అలవాటు లేదు..కానీ

మద్యం గురించి..మీకు..ఆ అలవాటు లేదు..కానీ

ఇక, ఇదే సందర్భంగా మద్యం విధానం..ధరల మీద చర్చ జరిగింది. స్టార్ హోటళ్లలో బార్లకు భారీగా ఫీజ నిర్ణయించటం ద్వారా..పర్యాటక రంగం మీద ప్రభావం పడుతోందని మంత్రి అవంతి శ్రీనివాసన్ సీఎం వద్ద ప్రస్తావించారు. దీనికి స్పందనగా..సీఎం..అన్నా.. మీరో..నేనో కుటుంబ సభ్యులతో టూరిజం ప్రదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రత్యేకతలను ఆస్వాదిస్తాం కానీ..రూంలో కూర్చుని తాగటానికి కాదు కదా అని వ్యాఖ్యానించారు. దీంతో..మంత్రి అవంతి మీరంటే శ్రీరామచంద్రుడు మీకు ఆ అలవాట్లు లేవు..మా లాంటి వారి గురించి ఆలోచించాలి కదా అంటూ వ్యాఖ్యానించగా..సీఎం వెంటనే మీరంతా కూడా శ్రీరా చంద్రులు కావాలని అనటంతో మంత్రులంతా నవ్వులు చిందించారు.

జనవరి 10 లేదా 11 ఎన్నికల నోటిఫికేషన్..

జనవరి 10 లేదా 11 ఎన్నికల నోటిఫికేషన్..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధింది ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. జనవరి 9న అమ్మఒడి పధకాన్ని ప్రారంభిద్దామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత రోజు లేదా 11న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇద్దామని ప్రతిపాదించారు. జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు డిసెంబర్ 20 లోగా మార్కెట్..దేవాలయ కమిటీల నియామకాలను పూర్తి చేయాలని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఆరు నెలల కాలంలోనే అమలు చేస్తున్న పధకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇక, ప్రతీ పాఠశాలలోల తెలుగు రెండో ప్రాధాన్యత అంశంగా కాకుండా ..తప్పనసరి అంటూ ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఏ ఉద్యోగమైనా ప్రభుత్వం లో ఉన్న సంస్థల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని సీఎం స్పష్టం చేసారు.

English summary
Ministers complaint to Cm ON ruling party mlas did not afraid of CM in controlling corruption. Cm assured that he will take care of it. CM clarified that Local body elections will be in coming january.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X