సంచలనంగా లక్ష్మీనాయుడు హత్య.. బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ !

ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో చోటుచేసుకున్న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆదేశాల మేరకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలా న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు హామీ ఇచ్చారు. అలానే లక్ష్మీనాయుడు భార్యతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని హోం మంత్రి తెలిపారు.

హోం మంత్రి అనిత వ్యాఖ్యలు..

అనిత మాట్లాడుతూ.. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషంతో, ఆర్థిక లావాదేవీ వివాదంతో జరిగిన దారుణ హత్య అని తెలిపారు. లక్ష్మీనాయుడు భార్యను కూడా నిందితుడు వేధించినట్టు గతంలో కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారు సమాజంలో తిరిగే హక్కు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వేగవంతంగా పరిష్కరించి, నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. లక్ష్మినాయుడు హత్యని రాజకీయాలు, కులాలకు ఆపాదించొద్దని.. వీలైతే వారి కుటుంబానికి సాయం చెయ్యండని అన్నారు.

ap-ministers-condolence-to-tirumalasetti-lakshminaidu-family-at-nellore

అసలు ఏం జరిగిందంటే..

అక్టోబర్ 2న రాళ్లపాడుకి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, తన సోదరులు పవన్, భార్గవ్‌లతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నా. ఆ సమయంలోనే అదే గ్రామానికి చెందిన హరిశ్చంద్రప్రసాద్ తన కారుతో ఉద్దేశపూర్వకంగా వారిని ఢీకొట్టాడని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా.. అతని సోదరులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడు హరిశ్చంద్రప్రసాద్‌తో పాటు అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య చిన్న ఆర్థిక లావాదేవీ వివాదం కారణంగా జరిగినట్లు తేలింది.

ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలను పోలీసులు ప్రశాంతంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రామానాయుడు వైసీపీని తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు కులాలకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+