సీఎం జగన్ హామీ ఇచ్చారు - ఆ హోదాలో కొనసాగుతాం : మంత్రుల కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ పైన చర్చ మొదలైంది. తాజాగా బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కేబినెట్ విస్తరణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను రెండున్నారేళ్ల తరువాత మారుస్తానని 2019లోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగించే అవకాశం ఉందని చెప్పారు. అదే సమయంలో మంత్రులుగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేసారు. పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని...దానిని డిమోషనల్ గా భావించకూడదని సూచించారు.
Recommended Video
2024 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి వారే మంత్రులుగా అవకాశం పొందుతారని వ్యాఖ్యానించారు. ఇక, దీంతో..మంత్రివర్గంలో కొనసాగే మంత్రులు ఎవరు.. అవకాశం కోల్పోయేది ఎవరనే చర్చ కొనసాగుతోంది. అసలు కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండచ్చనే దాని పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేబినెట్ విస్తరణ ఉంటుందని గతంలోనే తాను చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. కేబినెట్ లో ఎవరిని కొనసాగిస్తారో సీఎం ఇష్టమని చెప్పారు. తాను సీఎం ఏం చెప్పినా చేయటానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసారు.

అదే విధంగా..తిరిగి అధికారంలోకి రాగానే తొలిగించిన మంత్రులకు మరలా అవకాశం ఉంటుందని సీఎం హామీ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి రావటం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పని చేయటం గౌరవంగానే భావిస్తున్నామని మంత్రులు చెప్పుకొస్తున్నారు. మరో మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ సైతం తాము సీఎం సూచనల మేరకు పార్టీ కోసం పని చేయటానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు సహజంగానే ముందుగా ఎన్నికలు రావాలని కోరుకుంటారని చెప్పుకొచ్చారు. తాము మూడేళ్లు మంత్రులుగా ఉన్నామని.. పార్టీ కోసం ముఖ్యమంత్రి పని చేయాలని బాధ్యతలు అప్పగిస్తే అందుకు సిద్దమేనని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications