Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిపై ఇంకెన్ని యూటర్న్ లు ? వైసీపీపై మంత్రుల ఫైర్..!

ఏపీలో గతంలో అమరావతి రాజధానికి మద్దతిచ్చి, అనంతరం తాము అధికారంలో రాగానే మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి, ఇప్పుడు మరోసారి అమరావతికే మద్దతు అంటూ మరో యూటర్న్ తీసుకున్న వైసీపీపై కూటమి మంత్రులు మండిపడ్డారు. నిన్న ఓ ప్రైవేట్ కాంక్లేవ్ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యల్ని మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, నారాయణ తప్పుబట్టారు. వైసీపీ ఇంకెన్ని యూటర్న్ లు తీసుకుంటుందని ప్రశ్నించారు.

వైసీపీ అధ్యక్షుడికి రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని ఆయనే అసెంబ్లీ లో చెప్పాడని,ఆ తర్వాత పొలిటికల్ గేమ్ తో మూడు ముక్కలాట ఆడాడని గుర్తుచేశారు. ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలన్నారు. అమరావతి అనంతపురానికి, శ్రీకాకుళానికి సెంటర్ పాయింట్ లో ఉందన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ,పోర్టు ఎయిర్ పోర్టు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అమరావతికి ఒప్పుకుని అసెంబ్లీ లో జగన్ కూడా చేతులెత్తారని, మళ్ళీ ప్రభుత్వం రాగానే మాట మార్చారని గుర్తుచేశారు.

AP Ministers Hit Out at YSRCP Over Another U-Turn on Amaravati Capital

అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని, మళ్లీ అధికారం కోసం అమరావతి అని మాట మార్చడం కరెక్ట్ కాదని నారాయణ విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలు ఆ 11సీట్లు కూడా ఇవ్వరన్నారు. మూడు రాజధానులు అంటే మూడు ప్రాంతాల్లో ఓట్లు వేస్తారని నాటకం ఆడారన్నారు. రూములో కూర్చుని నలుగురైదుగురు ఇచ్చే సలహాలు పాటించకూడదని జగన్ కు సలహా ఇచ్చారు. సజ్జల ఆ పార్టీలో సీనియర్ నేత అని, ఆయన చెబితే వైసీపీ చెప్పినట్లే కదా అన్నారు. వారి పార్టీ అభిప్రాయమే ఆయన చెప్పాడన్నారు. సజ్జల చెబితే ఆయన పార్టీ బాధ్యతగా చెప్పినట్లేనన్నారు. తాను మంత్రిగా మాట్లాడితే సీఎం చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్లే కదా అన్నారు. అమరావతి,విజయవాడ, మంగళగిరి,తెనాలి,గుంటూరు కలిపి భవిష్యత్తులో మహా నగరంగా చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు.

మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కూడా వైసీపీ అమరావతి యూటర్న్ పై ఫైర్ అయ్యారు. ఏ ఎండకా గొడుగు కాసే రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయన్నారు. యూటర్న్ తీసుకోవడానికి ముందు అమరావతి ప్రజలు, మహిళలు, రైతులకు వైసిపి క్షమాపణ చెప్పాలన్నారు. అమరావతిని స్మశానంతో పోల్చిన వైసీపీ.. నేడు ఏ మొహం పెట్టుకుని అమరావతి రాజధాని అంటుందన్నారు.మూడు రాజధానులు పేరిట ఐదేళ్ల కాలాన్ని వృధా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల దించుకోవాలన్నారు. అమరావతి మునిగిపోతుందంటూ దుష్ప్రచారం చేసిన నేతలు.. నేడు సమర్థించడం వెనుక రాజకీయ దురాలోచన ఏమిటన్నారు.

AP Ministers Hit Out at YSRCP Over Another U-Turn on Amaravati Capital

అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే తత్వం వైసీపీది అన్నారు. ఈ విషయం మరోసారి రుజువైందన్నారు. జగన్ తత్వమెరిగి గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేత నేడు మనసు మార్చుకోవడం వెనుక ఏ కుటిల రాజకీయం ఉందో ప్రజలకు చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ప్రజలు వైసీపీని మళ్లీ నమ్మే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజనరీ చంద్రబాబుతోనే అమరావతి ప్రజా రాజధాని సాధ్యమనున్నారు. వైసీపీని నమ్మి మరోసారి మోసపోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+