అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు ఎన్టీఆర్ - నేడు జగన్ : నేడే లాస్ట్ డే- మూకుమ్మడి రాజీనామా : సీఎం రూట్ మ్యాప్..!!

|
Google Oneindia TeluguNews

రాజీనామా లేఖలతో కేబినెట్ భేటీకి మంత్రులు. నేడే మంత్రులుగా చివరి రోజు. రాజకీయంగా ఏపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలకు నేటి కేబినెట్ భేటీ వేదిక కానుంది. ఏపీ ప్రభుత్వంలో..అధికార పార్టీలో సమూల మార్పులకు రంగం సిద్దమైంది. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సీఎం జగన్ నిర్ణయించారు. 2019 లో అధికారంలో వచ్చిన తరువాత ఏర్పడిన జగన్ తొలి మంత్రి వర్గం చివరి భేటీ ఈ రోజు జరగనుంది. అదే సమయంలో ఏపీ చరిత్రలో నాడు ఎన్టీఆర్.. నేడు జగన్ కేబినెట్ విషయంలో ఒకే ఫార్ములా అనుసరిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ సైతం తన కేబినెట్ లోని అందరు మంత్రులను ఒకే సారి తప్పించారు.

సీఎం జగన్ అనూహ్య నిర్ణయంతో

సీఎం జగన్ అనూహ్య నిర్ణయంతో

ఆ నిర్ణయం వెనుక అనేక కారణాలు చోటు చేసుకున్నాయి. కానీ, నేడు సీఎం జగన్ మాత్రం ప్రక్షాళనలో భాగంగానే ప్రస్తుతం ఉన్న అందరు మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకొని..కొత్త వారితో మంత్రివర్గం ఏర్పాటుకు నిర్ణయించారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రులతో కేబినెట్ చివరి మీటింగ్ ఈ రోజు జరగనుంది. సచివాలయంలో మధ్నాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం అవ్వనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలనూ ర్యాటిపై చేయనున్నారు. ఇక మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించే అంశంతో పాటు మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులపైనా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

మంత్రులతో సీఎం మనసులో మాట

మంత్రులతో సీఎం మనసులో మాట

ఇక, సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదాన్ని తెలియచేయనుంది. అధికారిక అజెండా ముగిసిన తరువాత సీఎం జగన్ కేబినెట్ విస్తరణ పైన తన మనసులో మాట బయట పెట్టనున్నారు. ప్రస్తుత మంత్రులను ఎందుకు తప్పిస్తోంది.. ఎవరెవరిని కొనసాగించే ఛాన్స్ ఉందీ... పదవులు కోల్పోతున్న మంత్రులకు ఏ బాధ్యతల ద్వారా వారి సేవలను వినియోగించుకోనుందీ వివరించనున్నారు. ఇక పదవి కోల్పోతున్న మంత్రులకు తదుపరి అప్పగించే బాధ్యతలు..వారికి తిరిగి అధికారంలోకి వస్తే దక్కే ప్రాధాన్యతలను గురించి సీఎం హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒక విధంగా పదవి కోల్పోతున్న మంత్రులు ఎవరూ ఆవేదన చెందకుండా సీఎం వారిని అనునయిస్తూ.. కొత్త బాధ్యతలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం - పార్టీ బాధ్యతల్లో వారికే కీలకం చేసే విధంగా నిర్ణయాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.

కొనసాగించే మంత్రులపైనా క్లారిటీ

కొనసాగించే మంత్రులపైనా క్లారిటీ

ఇక, కొత్త మంత్రులు ఎవరు అనే అంశం పైన 9వ తేదీన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత.. ప్రస్తుత మంత్రులతో కలిపి సీఎం జగన్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త మంత్రివర్గం ఏర్పాటు పైన సీఎం జగన్ గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి సమాచారం ఇచ్చారు. ప్రస్తుత మంత్రుల్లో నలుగురు లేదా అయిదుగురిని తిరిగి కొనసాగించే అంశం పైన సీఎం ప్రస్తుత మంత్రులకు స్పష్టత ఇవ్వనున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే తిరిగి వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తోందనేది సీఎం వివరించనున్నారు. అయితే, పదవులు కోల్పోతున్న మంత్రులకు ఎటువంటి ప్రాధాన్యత తగ్గదని సీఎం చెప్పే ఛాన్స్ ఉంది.

రాజీనామా లేఖలతో మంత్రులు

రాజీనామా లేఖలతో మంత్రులు


ఇక, రాజీనామా లేఖలతోనే మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. వీటిని ఆమోదించి..కొత్త కేబినెట్ ఏర్పాటుకు రూట్ క్లియర్ చేయనున్నారు. ఇక, 2024 ఎన్నికల లక్ష్యంగా సీఎం జగన్ నేటి సమావేశంలో రూట్ మ్యాప్ పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇక, దాదాపుగా ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ సైతం భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి గడప గడపకు వైఎస్సార్సీపీ నిర్వహించనున్నారు. జూలై 8న పార్టీ ప్లీనరీ ద్వారా 2024 ఎన్నికల సమరశంఖం పూరించటానికి సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో..నేటి సమావేశం మంత్రులకు ఒక విధంగా భావోద్వేగ సమావేశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
Last cabinet meeting for present Ministers in AP Cabinet, After that All ministers may sumbit their resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X