ఏపీలో మరో ఎమ్మెల్సీ పోరు- ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో మరో ఎమ్మెల్సీ పోరుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే స్ధానిక సంస్ధల కోటా, పట్టభద్రుల కోటాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు ప్రకటన వచ్చింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం మండలిలో ఖాళీ అవుతున్న ఏడు సీట్లకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా,ప్రస్తుత ఎమ్మెల్సీలు నారా లోకేశ్,పోతుల సునీత,బచ్చుల అర్జునుడు,డొక్కా మాణిక్య వరప్రసాద రావు,వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స,గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా గత నెల 27న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా గాని లేదా వారి ప్రతిపాదకుడు గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారైన తన వద్దగాని లేదా సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉపకార్యదర్శికి గాని వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఈనెల 6వతేదీ నుండి 13వ తేదీ వరకూ సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నాం 3గం.ల వరకూ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్ పత్రాలను పై పేర్కొన్న స్థలం,సమయాల్లో పొందవచ్చని వివరించారు.
ఈనెల 14వతేదీన ఉదయం 11గం.లకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందని ఆగడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించు కోవాలనుకుంటే అభ్యర్ధిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్ధి లేదా వారి ప్రతిపాదకుడు లేదా రాతపూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు గాని రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి గాని అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉంటే ఈనెల 23వేతదీ ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు.పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అనగా 23వతేదీ సా.5గం.లకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
-
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications