ఏపీ ఎమ్మెల్సీ ఫలితాల అప్ డేట్

అమరావతి : ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న మొదటి అంతస్ధు కమిటీ హాల్లో చురుగ్గా సాగుతోంది. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటలకే పూర్తయింది. దీంతో నిబంధనల ప్రకారం 4 గంటల వరకూ వేచి చూసి సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరులో టీడీపీ బరిలోకి దించిన ఏకైక అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలుపొందినట్లు తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. టీడీపీ అభ్యర్ధి అనురాధ గెలుపుకోసం 22 ఓట్లు అవసరం అయ్యాయి. అదే సమయంలో టీడీపీని వీడి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తున్న తరుణంలో ఆ పార్టీ బలం 19కి తగ్గిపోయింది. దీంతోవైసీపీకి చెందిన ముగ్గురు మద్దతిచ్చే తప్ప ఆమె గెలిచే పరిస్ధితి లేదు. కానీ అనురాధ గెలిచారంటే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

ap mlc elections update : all 175 votes valid-who are the winners ?-here are details

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా వైసీపీ అభ్యర్ధులు మర్రి రాజశేఖర్, పెన్మత్స సురేష్ బాబు , జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్ధులందరికీ ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓటు వేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్ది పంచుమర్తి అనురాధకు మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేశారు. ఇప్పుడు అనురాధ విజయంతో వైసీపీ అభ్యర్ధుల్లో ఎవరు ఓడతారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+