AP MLC Results : ఎమ్మెల్సీగా ఓడిన కోలా గురువులు-రెండో ప్రాధాన్యతలో జయమంగళ విజయం
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు.దీంతో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బలం లేకపోయినా ఏడో అభ్యర్ధిని నిలబెట్టిన వైసీపీ సదరు అభ్యర్ధిని కోల్పోయింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ చెరో 21 ఓట్లు సాధించారు. వీరిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోలా గురువులు ఓడిపోయారు.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు చెరో 22 మంది ఎమ్మెల్యేల చొప్పున మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను జగన్ కేటాయించారు. అలాగే వీరి గెలుపు బాధ్యతను మంత్రులు మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ కు అప్పగించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్దులు మర్రి రాజశేఖర్ 22 ఓట్లు, సూర్యనారాయణ రాజు 22 ఓట్లు, బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు, పోతుల సునీత 22 ఓట్లు,యేసు రత్నం 22 ఓట్లు వచ్చాయి.

టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధాకు 23 ఓట్లు వచ్చాయి. అలాగే జయమంగళ వెంకట రమణకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు కోలా గురువులుకూ 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే వీరిద్దరికీ కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు వీరికి ఓటు వేయలేదు. అటు వైసీపీ రెబెల్ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తికే ఓటు వేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీ అధిష్టానం మాటను ధిక్కరించి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేసిన వ్యవహారంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇలా క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ అధిష్టానం ఓప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి అసలు దోషులెవరేనేది తేలిపోనుంది.












Click it and Unblock the Notifications