వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సరికొత్త రికార్డు -సగానికిపైగా ఓట్లు వైసీపీకే -భారీగా తగ్గిన టీడీపీ షేర్ -మున్సిపోల్స్ ఓటింగ్ శాతం ఇలా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీల గుర్తులపై జరిగిన ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆ పార్టీ.. సీట్ల పరంగానేకాదు, ఓట్ల పరంగానూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 11 కార్పొరేషన్లను ఫ్యాను గుర్తు క్లీన్ స్వీప్ చేయగా, 97.33శాతం మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుంది. మొత్తంగా ఆ పార్టీ పోలైనవాటిలో సగానికిపైగా ఓట్లను రాబట్టుకుంది..

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

NOTAకు ఎక్కువ ఓట్లొస్తే ఎన్నిక రద్దు -కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు -కీలక వాదనలుNOTAకు ఎక్కువ ఓట్లొస్తే ఎన్నిక రద్దు -కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు -కీలక వాదనలు

 వైసీపీకి 52.63శాతం ఓట్లు..

వైసీపీకి 52.63శాతం ఓట్లు..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్ల శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారే అధికార వైసీపీ ఏకంగా సగానికిపైగా ఓట్లను కొల్లగొట్టింది. ఈసీ లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 52.63 శాతం ఓట్లు పడ్డాయి. అదే ప్రతిపక్ష టీడీపీ మాత్రం 30.73 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో (39.99 శాతంతో) పోల్చుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం భారీగా పతనమైంది. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ హవా కొనసాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక

బీజేపీ కన్నా జనసేన మిన్న

బీజేపీ కన్నా జనసేన మిన్న

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. మిత్రుడి కంటే చాలా చోట్ల మెరుగైన ఫలితాలను, ఓట్లను రాబట్టుకోగలిగింది. కూటమిలో జూనియర్ భాగస్వామి బీజేపీనే అయినప్పటికీ, కమలం పార్టీ పవన్ కల్యాణ్‌నే జూనియర్ గా వ్యవహరిస్తోందనే వాదన నడుమ ఈ సంఖ్య మరింత ఆసక్తికరంగా మారింది. మున్సిపోల్స్ లో బీజేపీకి కేవలం 2.41శాతం ఓట్లు దక్కగా, జనసేనకు దాదాపు రెట్టింపుగా 4.67ఓట్లు దక్కాయి. ఇక సీపీఐకి 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్‌ 0.62 శాతం ఓట్లు దక్కాయి. ఇండిపెండెండ్లకు 5.73 శాతం ఓట్లు దక్కగా, నోటాకు 1.07 శాతం ఓట్లు పడ్డాయి.

2014లో అలా.. 2021లో ఇలా...

2014లో అలా.. 2021లో ఇలా...

చివరిసారిగా 2014లో ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ఓటింగ్ శాతం కాకుండా, ఆయా పార్టీలు సాధించిన సీట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆ లెక్కన నాడు వైసీపీ 939 (36.52 శాతం)వార్డుల్ని గెలుచుకోగా, టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. ఇప్పటి(2021) మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. తద్వారా 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు, టీడీపీకి 39.99 శాతం ఓట్లు, జనసేనకు 5.53 శాతం ఓట్లు దక్కగా, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ షేర్ భారీగా క్షీణించినట్లయింది.

చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివేచంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే

English summary
andhra pradesh election commission on Monday released the details of percentage of votes cast for the respective parties in municipal elections. The ruling ysrcp got 52.63 per cent of the vote. Opposition TDP got 30.73 per cent votes, BJP 2.41 per cent, Janasena 4.67 per cent, CPI 0.80 per cent, CPM 0.81 per cent and Congress 0.62 per cent. The TDP's vote share has fallen sharply compared to the general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X