వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దెబ్బకు ఓవైసీకి భారీ లాస్ -హిందూపూర్‌లో బోణీతో సరి -చంద్రబాబుకు ఎంఐఎం రిటర్న్ గిఫ్ట్!

|
Google Oneindia TeluguNews

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎదురుదెబ్బ తప్పలేదు. ఆదివారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్ పార్టీ కేవలం హిందూపూర్ మున్సిపాలిటీతో బోణి కొట్టడంతోనే సరిపెట్టుకుంది. బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్న అసదుద్దీన్ ఓవైసీ విమర్శల్ని జనం లైట్ తీసుకున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకూ షాక్ తగిలినట్లైంది.

షాకింగ్ affair: ముగ్గురు పిల్లల తల్లి -పక్కింటి 15ఏళ్ల కుర్రాడితో పరార్ -యూపీలో ఘటన, పోలీసుల గాలింపుషాకింగ్ affair: ముగ్గురు పిల్లల తల్లి -పక్కింటి 15ఏళ్ల కుర్రాడితో పరార్ -యూపీలో ఘటన, పోలీసుల గాలింపు

 4 జిల్లాల్లో ఒకే ఒక్క వార్డులో..

4 జిల్లాల్లో ఒకే ఒక్క వార్డులో..

రాష్ట్రం విడిపోయిన 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఆదోని మున్సిపాలిటీలో ఎంఐఎం ఏకంగా 4వార్డుల్ని గెలుచుకుంది. ఇటీవల ఏపీలోనూ పార్టీ విస్తరణపై ఫోకస్ పెంచిన ఓవైసీ.. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 4 జిల్లాలు(కర్నూలు, అనంతపురం, కడప, కృష్ణా) కవర్ అయ్యేలా వ్యూహాత్మకంగా మొత్తం 47 వార్డుల్లో అభ్యర్థుల్ని నిలిపారు. అయితే, ఆదివారం వెలువడిన ఫలితాల్లో జగన్ దెబ్బకు పతంగి చిరిగిపోయింది. కేవలం ఒకే ఒక్క వార్డులో ఎంఐఎం గెలవగలిగింది. అయితే..

 హిందూపూర్‌లో ఎంఐఎం బోణి

హిందూపూర్‌లో ఎంఐఎం బోణి

అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గతంలో కర్నూలు జిల్లాలోని ఆదోనిలో 4 సీట్లు గెల్చుకోగా, ఇప్పుడా నాలుగూ గల్లంతైపోయాయి. ఆదోని మున్సిపాలిటీలో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. మొత్తం 42 వార్డులకు గాను 40వార్డుల్లో వైసీపీ గెలవగా, టీడీపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. అయితే, ఎంఐఎం తొలిసారిగా అనంతపురం జిల్లాలోని హిందూపూర్ లో బోణీ కొట్టింది. హిందూపూర్ మున్సిపాలిటీ 16వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి జిగిని 123 ఓట్లతో విజయం సాధించారు. నిజానికి..

జగన్ సీటుకు ముప్పు తప్పినట్లేనా?

జగన్ సీటుకు ముప్పు తప్పినట్లేనా?

ఇటీవల హిందూపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ.. ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఈ విషయం పట్టనట్లుగా సీఎం జగన్ కళ్లు మూసుకుని ఉంటే ఆయన సీటుకే ఎసరు వస్తుందని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల జగన్ జాగ్రత్తగా ఉండాలని, మతోన్మాదులను ఉక్కుపాదంతో అణిచేయాలని సూచించారు. అటు ఆదోని ప్రచారంలోనైతే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని బేకార్ అంటూ ఓవైసీ తిట్టిపోశారు. తీరా ఆదివారం నాటి ఫలితాల్లో ఎంఐఎం కేవలం ఒకే ఒక్క వార్డుకు ఫలితమైపోవడం, బీజేపీ సైతం అడ్రన్ లేకుండా పోవడాన్ని బట్టి అసదుద్దీన్ వ్యాఖ్యలకు విలువలేనట్లేనని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కాగా,

బాలయ్య త్యాగం వృధా..

బాలయ్య త్యాగం వృధా..


పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతిన్న దరిమిలా, మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న చంద్రబాబు పిలుపుమేరకు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ త్యాగాలకు సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్స్ ను కూడా నిలిపేసుకున్న బాలయ్య.. హిందూపూర్ లో స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేయకుండా భరోసాగా నిలిచారు. విబేధాలు లేకుండా నాయకులందర్నీ సమన్వయపరుస్తూ ముందుకెళ్లారు. ఆయన డెడికేషన్ చూసినవాళ్లందరూ టీడీపీ గెలుపు పక్కా అనుకున్నారు. కానీ హిందూపురం ఓటర్లు మాత్రం వైసీపీకే మద్దతుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వేవ్‌ ఎదుర్కుని మరీ గెలిచిన బాలయ్య, పంచాయతీ, పుర పోరులో మాత్రం చతికిలపడ్డారు. ఇదిలా ఉంటే..

చంద్రబాబుకు ఓవైసీ రిటర్న్ గిఫ్ట్

చంద్రబాబుకు ఓవైసీ రిటర్న్ గిఫ్ట్

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అనుసరించిన వ్యూహాలపై తొలి నుంచీ చర్చ జరుగుతున్నట్లే ఆదివారం నాటి ఫలితాలు వెలువడ్డాయనే కామెంట్లు వస్తున్నాయి. టీడీపీ, వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం అభ్యర్థులను దింపారని, దీంతో టీడీపీ కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం ఓటు బ్యాంకు చీలిందని, తద్వారా వైసీపీ అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారనే ప్రచారాన్ని టీడీపీ క్యాంప్ నిర్వహిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టేందుకు ఎంఐఎం రంగంలోకి వచ్చిందని, గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.. చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామన్న వ్యాఖ్యలను ఈరకంగా నిజం చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంviral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

English summary
a big setback to aimim chief asaduddin owaisi, who deployed mim candidates in 47 wards and wins only one seat. it is also check to local tdp mla nandamuri balakrishna in hindupur Out of the total 38 wards, YSRCP won 27, TDP 6, BJP 1, MIM 1 and others 1 ward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X