విజయవాడ-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ కు పల్నాడులో కొత్త హాల్ట్..!

విజయవాడ నుంచి హైదరాబాద్ లోని లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఓ అలర్ట్. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి లింగంపల్లికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడ కీలకమైన పిడుగురాళ్ల (Piduguralla) స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు ఇవ్వబోతోంది. దీంతో పిడుగు రాళ్ల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగపడనుంది.

హైదరాబాద్-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ రైలు 12795/12796కు పిడుగు రాళ్ల స్టేషన్ లో హాల్ట్ సౌకర్యం కల్పించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఈ నెల 11న లేఖ రాశారు. ఈ లేఖకు స్పందిస్తూ ఎంపీ కోరినట్లుగానే పిడుగురాళ్లలో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీ లావు కృష్ణదేవరాయలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు.

Good News for Piduguralla Commuters Railways Approves New Stop on Vijayawada Lingampalli Express

దీంతో త్వరలోనే పిడుగు రాళ్ల స్టేషన్లో కీలకమైన విజయవాడ-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ రైలు ఆగబోతోంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 7.30కు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 11.35కు లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి నుంచి బయలుదేరే రైలు తెల్లవారు జామున 4.40కు బయలుదేరుతుంది. ఇది విజయవాడకు ఉదయం 10.35కు చేరుతుంది. ఈ రైలుకు ప్రస్తుతానికి రెండు వైపులా గుంటూరు, నరసరావుపేట, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ లో మాత్రమే హాల్ట్ లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు పిడుగురాళ్ల కూడా హాల్ట్ గా చేరబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+