నేను డ్రింక్ చేస్తాను.. అందులో తప్పేంటి - అనసూయ
అనసూయ... ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, తన ప్రతిభ, చలాకీ మాటలు, డాన్స్‌లు, స్టేజ్ ప్రెజెన్స్‌తో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా 'జబర్దస్త్' షో ద్వారా ఇంటింటా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. 40 ఏళ్ల వయస్సులో కూడా మరింత అందంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.
రంగస్థలం తర్వాత మారిన కెరీర్ గ్రాఫ్
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' సినిమాలో కీలక పాత్రలో నటించి అనసూయ సినిమాల కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ పాత్రతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా పొందింది. ఆ తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కట్టాయి. కథకు అవసరమైన బలమైన పాత్రల్లో నటిస్తూ, గ్లామర్‌కే పరిమితం కాకుండా తన నటనతో మెప్పిస్తున్న నటి గా గుర్తింపు సంపాదించింది. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. ముద్దులు, హగ్గులు, బికినీలతో ఉండే పోస్టులు సైతం షేర్ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటారు. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. తాను అప్పుడప్పుడు పబ్లిక్ పార్టీల్లో లేదా పర్సనల్ స్పేస్‌లో లిమిటెడ్‌గా డ్రింక్ (మద్యం) చేస్తానని, అయితే అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని కూడా కొందరు సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో పెద్ద వివాదంగా మార్చి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు ఇలాంటి నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోవడం లేదని, కాలక్రమంలో ఈ ఇండస్ట్రీలో ఎలా బతకాలో, ఇలాంటి వారిని ఎలా ఎదుర్కొని ముక్కుసూటిగా సమాధానం చెప్పాలో నేర్చుకున్నానని ఆమె తేల్చి చెప్పింది. తన చుట్టూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, జీవితంలో మరింత ఎత్తుకు ఎదుగుతానని అనసూయ భరద్వాజ్ ఎంతో ధైర్యంగా వెల్లడించింది. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications