జగన్ అనుకున్నదే చేసిన టీడీపీ, గురి పెట్టి.. పడగొట్టి- ఆ ఒక్కటే ఆశ..!!

స్థానిక ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి. అందునా మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పెద్ద సంఖ్యలో మున్సిపాల్టీలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఏకగ్రీవాలు జరిగితే అంగీకరించేది లేదని జగన్ చెప్పటంతో.. ఇప్పుడు కడప జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయి. ఇక.. టీడీపీ ఏకగ్రీవాలు చేసిన మున్సిపాల్టీలు ఏరికోరి ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు జగన్ కు ఈ ఏకగ్రీవాల పై ఒక్కటే ఆశ మిగిలి ఉంది.

మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకూడదనేది జగన్ నిర్ణయం. దీనికి భిన్నంగా టీడీపీ జగన్ సొంత జిల్లాలోనే పెద్ద సంఖ్యలో మున్సిపాల్టీలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. కడపతో సహా 2021 లో దెబ్బ తిన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని మరీ ఏకగ్రీవాలు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. సుప్రీం ఆదేశాలతో పోలింగ్... కౌంటింగ్ తేదీలను రీషెడ్యూల్ చేసారు. కాగా.. పోటీలో ఉన్న తుది అభ్యర్ధుల జాబితా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ 17 ఛైర్‌పర్సన్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 15, జనసేన 1, బీజేపీ 1 చొప్పున విజయం సాధించాయి. వార్డులు, డివిజన్ల వారీగా కూటమి తరఫున మొత్తం 726 స్థానాలు (టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28) ఏకగ్రీవం కాగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లోనే ఏకగ్రీవ విజయాలను నమోదు చేసింది. సీపీఐ ఒక స్థానంలో, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

పవన్ కోరుతున్న జెడ్పీ స్థానాలు, ఎవరెక్కడ - కూటమిలో సర్దుబాటు ఇలా..!!
పవన్ కోరుతున్న జెడ్పీ స్థానాలు, ఎవరెక్కడ - కూటమిలో సర్దుబాటు ఇలా..!!
ap-municipal-elections-tdp-jana-sena-bjp-alliance-wins-17-municipalities-unopposed-here-the-detai

సుప్రీంకోర్టులో విచారణ

కాగా.. కడప జిల్లాలో 8 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 6 చోట్ల ఛైర్‌పర్సన్ పదవులను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు గాను 50 స్థానాలను, పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 20 వార్డులను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. వీటితో పాటు పుంగనూరు, నగరి, గురజాల నియోజకవర్గాల్లోని మూడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ కూటమి జెండా ఎగరేసింది. ఇప్పుడు కేవలం జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాలకు, కడప కార్పొరేషన్ మేయర్ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే.. సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. తిరిగి ఈ నెల 27వ తేదీన విచారణ కొనసాగించనుంది. కోర్టు నిర్ణయం పైన వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే... విజేతలను ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఈ విచారణ వేళ ఏం చెబుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+