31న సచివాలయంలో జగన్ ఎంట్రీ: జూన్7న క్యాబినెట్ విస్తరణ : 12న సీఎంగా అసెంబ్లీలో అడుగు..!
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్ ఇక, తన అధికారిక షెడ్యూల్‌ను పరగులు పెట్టిస్తున్నారు. 30వ తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, ముఖ్యమంత్రి హోదాలో ఈనెల 31న ఏపీ సచివాలయంలో ఎంట్రీ ఇస్తున్న జగన్ జూన్ 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ ఏడవ తేదీన జగన్ తన కేబినెట్‌ను విస్తరించాలని డిసైడ్ అయ్యారు.
ఇక..సీఎంగా..అంతా నిర్ణయాల్లోనే..
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి..అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకరణ కార్యక్రమం లో పాల్గొంటారు. ఇక, ఈనెల 31న ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏపీ సచివాలయంలో అడుగు పెడుతున్నారు. ఆ తరువాతి రోజు సైతం సచివాయయంలోనే అధికారిక కార్యక్రమాల్లో ఉంటారు. ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఇక, జూన్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు వివిధ శాఖలకు సంబంధించిన అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జూన్ ఏడవ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసారు. అదే రోజు సాయంత్రం సచివాలయంలో జగన్ అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది.

జూన 12న అసెంబ్లీ సమావేశం..
జూన్ 12వ తేదీన ఏపీ నూతన అసెంబ్లీ సమావేవం కానుంది. అదే రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తొలుత సభా నాయకుడిగా జగన్ శాసన సభ్యుడిగా ప్రమాణం చేస్తారు. ఆ తరువాత ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు. ఇక, మిగిలిన 173 మంది అదే రోజు ప్రమాణం చేయటంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ముగియనుంది. సమావేశం ఉదయం సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన సభ్యులతో ప్రమాణం చేయించే బాధ్యత స్వీకరిస్తారు. ఇక, జూన్ చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో రెగ్యులర్ స్పీకర్ తో పాటుగా డిప్యూటీ స్పీకర్‌ను సైతం ఎన్నుకోనున్నారు. దీంతో..ఇక జూన్ 12 నాటికి కొత్త ప్రభుత్వంలో అధికారిక లాంఛనాలు పూర్తి కానున్నాయి.












Click it and Unblock the Notifications