సీఎం జగన్ పక్కచూపులు చూస్తారా : తప్పెవరిది..అధికారులదా..పార్టీ నేతలదా: ఏంటీ నిర్లక్ష్యం..!
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా..ఆయన ఫొటోను మంత్రుల పేషీల మొదులు జిల్లాల్లోని తహసీల్దార్ కార్యాలయాల వరకు సీఎం ఫోటో ఏర్పాటు చేయటం ఆనవాయితీ. రెండు రోజుల క్రితం సచివాలయంలో అప్పటి వరకు ఉన్న చంద్రబాబు ఫొటోలను తొలిగించి ఆయన స్థానంలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఫొటోలను ఏర్పాటు చేసారు. అయితే, అక్కడ లోపం కనిపిస్తోంది. ఆ లోపమే ఇప్పుడు సచివాలయం మొదలు అనేక ప్రాంతాల్లో చర్చకు కారణమైంది.
సీఎం జగన్ ఫొటో చూసారా..
ముఖ్యమంత్రిగా జగన్ ఫొటోలు చూసిన తరువాత సచివాలయం నుండి కింది స్థాయి వరకు ఒక చర్చ మొదలైంది. సీఎం జగన్ ఫొటో జాగ్రత్తగా గమనిస్తే..ముఖ్యమంత్రి జగన్ పక్క చూపులు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మొదలు ప్రతీ చోట రాష్ట్రపతి..ప్రధాని ఫొటోలు గతంలో ఏపీలో పని చేసిన ముఖ్యమంత్రుల ఫోటోలు చూస్తే...వారు నేరుగా చూస్తున్నట్లుగానే కనిపిస్తాయి.

కానీ, కొత్త ముఖ్యమంత్రి అధికారిక ఫొటో ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో జగన్ నేరుగా కాకుండా..పక్కకు చూస్తున్నట్లుగా ఉంది. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఈ ఫొటో ఎంపిక చేసింది పార్టీ నేతలా..లేక అధికారులా అనే దాని పై చర్చ సాగుతోంది. జగన్‌వి ఎన్నో ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. అటువంటిది ఒక ముఖ్యమంత్రి ఫొటోను అధికారిక ఫొటోగా విడుదల చేసే ముందు..పూర్తి స్థాయిలో పరిశీలన లేకుండానే విడుదల చేయటం బాధ్యతా రాహిత్యంగా చెబుతున్నారు.
దిద్దుబాటు చర్యలు చేస్తారా..
ఏకంగా ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటులోనే నిర్లక్ష్యం బయట పడింది. ఇవే పొటోలు ఇంకా పూర్తి స్తాయిలో పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు. సచివాలయంతో పాటుగా హెచ్ఓడీల్లో మాత్రమే ఇప్పటి వరకు ఇవే ఫొటోలు సాధారణ పరిపాలనా శాఖ నుండి పంపిణీ జరిగింది. ఇక, ఇప్పటికైనా ఆ ఫొటోలను తప్పించి ఎటువంటి లోపాలు లేని ఫొటోలను పంపిణీ చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరి..ఈ లోపాన్ని అటు అధికారులు కానీ, ఇటు పార్టీలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షిస్తున్న నేతలు కానీ బాధ్యత తీసుకోవాలంటూ వైసీపీ కార్యాలయానికి సందేశాలు పంపుతున్నారు. గతంలో చంద్రబాబు ఫొటో..ఇప్పుడు జగన్ ఫొటో మధ్య ఉన్న తేడాను ప్రస్తావిస్తున్నారు.












Click it and Unblock the Notifications