వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా తగ్గాక ఏపీ స్ధానిక ఎన్నికలు ? రెడీగా ఉండాలన్న ఎస్ఈసీ కనగరాజ్...

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ సందర్భంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడటం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, తాజా పరిస్ధితులపై కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ ఇవాళ విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో స్ధానిక ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులు ఎంత మేరకు సహకరించేలా ఉన్నాయి, కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

 కరోనా తగ్గిన వెంటనే స్ధానిక పోరు...?

కరోనా తగ్గిన వెంటనే స్ధానిక పోరు...?

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ సంకేతాలతో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఈ గడువు నెలాఖరుతో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈసీగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెలాఖరులోపు ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తాజా పరిస్ధితిపై ఆయన వివరాలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎప్పటికల్లా పరిస్ధితి అనువుగా ఉండొచ్చన్న అంశాలపై ఆయన అధికారులను ఆరా తీశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆయన కోరారు.

కరోనా పరిస్ధితులపై వివరణ..

కరోనా పరిస్ధితులపై వివరణ..

ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్ధితులపై అధికారులతో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో , దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని తెలిపారు. సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండాలన్నారు.

ఈసీ పాత్రపై అభిప్రాయాలు..

ఈసీ పాత్రపై అభిప్రాయాలు..

ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని కమిషనర్ కనగరాజ్ అన్నారు. చక్కటి అవగాహన తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పేరు ను తీసుకుని రావడంలో అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యదార్ధ స్థితిని అధికారులు కమిషనర్ కి వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఏస్.రామసుందర రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ వి సత్య రమేష్ , జెడి సాయి ప్రసాద్, ఎ ఎస్ సాంబ మూర్తి , పీఎస్ రామారావు పాల్గొన్నారు.

English summary
andhra pradesh state election commissioner justice kanagaraj reviews the latest situation over spread of coronavirus. during the review election commissioner asks the officials to be ready for the local body polls whenever comes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X