4 నెలలుగా జీతాల కోసం ఉద్యోగుల పడిగాపులు..జగన్ సర్కార్ పై ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడి షాకింగ్ కామెంట్స్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్ చేశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందాలని తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్టు ఆయన నేడు తిరుమలలో మాట్లాడారు . ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న తరువాత ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాలుగు నెలలుగా నో శాలరీస్ .. కూరగాయలు, పాలవాళ్ళ దగ్గర చులకన

నాలుగు నెలలుగా నో శాలరీస్ .. కూరగాయలు, పాలవాళ్ళ దగ్గర చులకన

గత నాలుగు నెలలుగా జీతాల కోసం ఉద్యోగులు పడిగాపులు పడుతున్నారని, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏపీలో నెలకొందని ఆయన అన్నారు. 11వ పిఆర్సి వెంటనే అమలు చేయడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జీతాలు లేక కూరగాయలు, పాల వాళ్ల దగ్గర కూడా ఉద్యోగులపై చులకన భావన ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారిందని స్పష్టం చేశారు.

జీతాలు , పెన్షన్లు ఇవ్వాలని, 11 వ పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి

జీతాలు , పెన్షన్లు ఇవ్వాలని, 11 వ పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి

రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే 11 వ పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారని వాటన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు .త్వరలో ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తాజా వ్యాఖ్యలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని తెలుస్తుంది.

జీతాల కోసం బాహాటంగానే .. ఏపీ ఆర్ధిక స్థితి ఆందోళనకరం

జీతాల కోసం బాహాటంగానే .. ఏపీ ఆర్ధిక స్థితి ఆందోళనకరం

ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని ఏపీ ఆర్థిక పరిస్థితి తేటతెల్లం అవుతుంది. గతంలో ఒకటవ తారీఖున కచ్చితంగా జీతాలు తీసుకున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు గత నాలుగు నెలలుగా జీతాలు లేక జీతాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాల పందేరం వెరసి ఉద్యోగులకు జీతాల కష్టాలు వచ్చిపడ్డాయి. నిన్నటి వరకు లోలోపల మదనపడిన వారంతా ఇప్పుడు బాహాటంగానే జీతాల కోసం ప్రశ్నిస్తున్న తీరు తాజా ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడి వ్యాఖ్యలతో కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+