Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి తుఫాను నష్టం రూ 5 వేల కోట్లకు పైగా.. శాఖల వారీగా..!!

ఏపీకి మొంథా తుఫాను భారీ నష్టం మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాన్ని వణికించింది. ముందస్తు చర్యలు చేపట్టటంతో ప్రాణ నష్టం తప్పినా.. ప్రభుత్వానికి మాత్రం భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు ప్రభుత్వానికి తుఫాను నష్టం పైన ప్రాధమిక నివేదిక అందించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తోంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసారు.

తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన ప్రభుత్వం ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో విపత్తుల శాఖ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తం మీద 5265.51 కోట్ల 5 నష్టం వచ్చినట్లు ప్రాథమిక అంచనాగా చెప్పారు. అందులో ప్రధానంగా వ్యవసాయంలో 829కోట్ల మేర నష్టం జరిగింది. హార్టికల్చర్ లో 39.99 కోట్లు, సేరికల్చర్ లో 65 లక్షలు నష్టం వాటిల్లిందని వివరించారు. పశుసంవర్థకశాఖ లో 75లక్షలు నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ కి ఇద్దరు చనిపోయి నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పడవ కొట్టుకుపోతుందని ఆందోళనతో వెళ్లి కొట్టుకుపోయారని చెప్పారు. ఇంకొకరు కాలకృత్యాలకి వెళ్లి చనిపోయాని వివరించారు.

ap-officials-submits-preliminary-estimates-put-loss-due-to-cyclone-around-rs-5265-51-cr

ఇక, మత్స్య శాఖలో 1270 కోట్ల నష్టం వాటిల్లగా.. మున్సిపల్ శాఖలో 109కోట్లు నష్టం వాటిల్లింది. హౌసింగ్ లో 5. 53 కోట్లు నష్టం, ఆర్ అండ్ బి కి ఎక్కువ నష్టం వాటిల్లింది. ఆర్ అండ్ బి కి రూ. 2080 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు వివరించారు. జలవనరుల శాఖ కు 207 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా తేల్చారు. రూరల్ వాటర్ సప్లై కి 1.26 కోట్ల నష్టం, పంచాయతి రాజ్ శాఖలో 8.70 కోట్ల నష్టం వచ్చింది అధికారులు ప్రాధమిక నివేదికలో వెల్లడించారు. తుఫాను సమయంలో సీఎస్ నుంచి మొదలుకుని గ్రామస్థాయి ఉద్యోగి వరకూ అందరూ రాత్రింబవళ్లు పని చేశారని చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీతో అన్ని శాఖలను అనుసంధానం చేస్తున్నాం... ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పారు. వర్షాలు, తుఫాన్లు ఆపలేం.. కానీ ప్రాణనష్టం తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+