వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో విచిత్ర పరిస్ధితి- టార్గెట్ జగన్ కాదు అప్పులే-విపక్షాలకు వరంగా ఖాళీ ఖజానా

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనూ ఎప్పుడూ లేనంత ఆర్ధిక సంక్షోభాన్ని వైసీపీ సర్కార్ ఎదుర్కొంటోంది. కొత్తగా రూపాయి కూడా అప్పు పుట్టని పరిస్ధితుల్లో ఉద్యోగుల జీతాలు, పింఛన్లను సైతం ఆలస్యంగా చెల్లిస్తోంది. దీంతో కోట్లాది రూపాయల కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ విపక్షాలకు టార్గెట్ గా మారిపోతోంది. దీంతో జగన్ సర్కార్ విధానాలనో, సీఎం జగన్ నో టార్గెట్ చేయాల్సిన విపక్షాలు కాస్తా ఆర్ధిక వ్యవస్ధనే నమ్ముకుని రాజకీయాలు చేయాల్సి వస్తోంది.

మరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలుమరో జాబ్ క్యాలెండర్ ? - జగన్ సర్కార్ సంకేతాలు- మరిన్ని ఉద్యోగాలు

 బలహీనంగా ఏపీ విపక్షాలు

బలహీనంగా ఏపీ విపక్షాలు


ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్... తాజాగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈ రెండేళ్లలోనూ కోలుకోలేకపోయాయి. అన్నిరంగాల్లాగే కరోనా ప్రభావం వీరిపైనా పడింది. రోడ్లపైకి ఆందోళనలు చేసే పరిస్ధితి లేక ఆన్ లైన్ లో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ ఈ రెండేళ్లు కాలం గడిపేసిన విపక్షాలకు అడపా దడపా మాత్రమే నిరసనలు తెలిపే అవకాశం దక్కింది. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా శూన్యంగా గడిపేయలేక, అలాగని ప్రభుత్వాన్ని ఏ విషయంలో టార్గెట్ చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి.

అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చిన వైసీపీ

అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చిన వైసీపీ

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర ఖర్చుపెట్టి సంక్షేమ అజెండాను అమలు చేసింది. అయితే దీని వల్ల అసలే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం మరింత అప్పుల్లోకి కూరుకుపోయింది. ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల జీతాలు, పించన్లను సకాలంలో చెల్లించలేని పరిస్దితి వచ్చింది. దీనికి తోడు కొత్తగా రాబడి మార్గాలేవీ కనిపించకపోవడంతో అప్పులనే ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. చివరికి తాము అధికారంలో ఉన్న సమయంతో పాటు రాబోయే 25 ఏళ్లకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్ధితి ఎదురవుతోంది. అయినా రహస్య ఒప్పందాలు చేసుకుని మరీ అప్పులు తెస్తున్నారు.

 జగన్ అప్పులపైనే విపక్షాల ఆశలు

జగన్ అప్పులపైనే విపక్షాల ఆశలు


జగన్ సర్కార్ కుప్పలతెప్పలుగా చేస్తున్న అప్పులు విపక్షాలకు వరంగా మారిపోయాయి. గతంలో ఓ ప్రభుత్వాధినేతను కానీ, ప్రభుత్వ విధానాలను కానీ విమర్శించే విపక్షాలు ఇప్పుడు కేవలం అప్పులనే నమ్మకునే పరిస్ధితి దాపురించింది. మిగతా అంశాలపైనా విమర్శలు చేస్తున్నా ప్రధానంగా అప్పుల విషయంలో తాజాగా పయ్యావుల కేశవ్, జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇరుకునపెడుతున్నాయి. దీంతో వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అలాగని మౌనంగా ఉండిపోలేక సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

జగన్ కాదు అప్పులే టార్గెట్

జగన్ కాదు అప్పులే టార్గెట్

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడల్లా విపక్షాలు సీఎం జగన్ నే టార్గెట్ చేసుకునేవి. కానీ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో లభించిన ఫలితాలు చూశాక జగన్ కు బదులుగా ఆయన చేస్తున్న అప్పుల్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. జగన్ ను టార్గెట్ చేస్తే జనంలో పలుచన అవుతామని, దానికి బదులుగా ఆయన ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని టార్గెట్ చేయడం ద్వారా అంతిమంగా జగన్ ను ఇరుకునపెట్టొచ్చని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే అప్పులతో పయ్యావుల కేశవ్, పీడీ ఖాతాలతో జీవీఎల్ నరసింహారావు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.

English summary
amid weak financial condition of the state, andhrapradesh opposition parties target jagan govt's loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X