ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఏపీ విపక్షాల ఫైర్-జనాల్ని పీక్కుతింటున్నారన్న చంద్రబాబు
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే వారానికో ఛార్జీల మోత మోగిస్తున్న ప్రభుత్వం.. ఈసారి ఆర్టీసీ ఛార్జీల్ని పెంచడంపై ప్రధాన విపక్షం టీడీపీతో పాటు సీపీఐ కూడా తప్పుబట్టాయి. ప్రజల్ని పీక్కుతింటున్నారంటూ విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ సర్కార్ అసమర్ధత పాలనతో పన్నుల మోత మోగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వారానికో ఛార్జీలు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే ప్రభుత్వం పెంచుతున్న వరుస ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల రూపంలో మరింత భారం మోపడం సరికాదని చంద్రబాబు తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ప్రజా రవాణా సంస్ధ ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణమన్నారు.

రాష్ట్రంలో బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్నీ, ప్రజల్నీ ఎటు తీసుకెళ్తున్నారని జగన్ సర్కార్ ను ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఆధికారంలోకి వచ్చాక రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మరో విపక్షం సీపీఐ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపును తప్పుబట్టింది.
ఆర్టీసీ ఛార్జీల పెంపును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. ఇప్పటికే చెత్త, నీటి, ఆస్తి పన్నుల రూపంలో ప్రజలపై మోత మోగిస్తున్నారని,ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల్ని కూడా పెంచడం దారుణమన్నారు. పండుగ సీజన్లలో ఇప్పటికే అదనపు ఛార్జీలతో పిండుకుంటున్న ఆర్టీసీ.. ఇఫ్పుడు పేద, మధ్యతరగతి ప్రజల ప్రయాణాలపై భారం మోపడం సరికాదన్నారు. జగన్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలపై రివర్స్ లో వెళ్తున్నారని, కేంద్రాన్ని పెట్రో ఛార్జీలపై నిలదీయలేక.. ప్రజల నెత్తిన గుదిబండ మోపుతున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications