చంద్రబాబు నిర్ణయానికి మద్దతు : అమరావతిలో కోటంరెడ్డి - బీజేపీ నేతలు..!!
రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ చేస్తున్న ఉద్యమం 1200 రోజుకు చేరింది. స్థానికులకు మద్దతుగా వైసీపీ మినహా ఇతర పార్టీల నేతలు తరలి వచ్చారు. వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి రైతులకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ - బీజేపీ నేతలు రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అమరావతికి ప్రతి టీడీపీ కార్యకర్త మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు.
కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి లో రైతులకు టీడీపీ - బీజేపీ-కాంగ్రెస్ నేతలు సంఘీభావంగా తరలి వచ్చారు. శ్రీరాముడి రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుడుది ద్వారకా, దేవతల రాజధాని అమరావతి అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పుకొచ్చారు.ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మద్దతు పలికారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని ప్రపంచ తెలుగు ప్రజల ఆకాంక్షా కోటంరెడ్డి పేర్కొన్నారు. తనకూ అమరావతి ఉద్యమానికి ఏదో తెలియని బంధం ఉందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేనని, సీఎం జగన్ ఏమి చెపితే అదే మాట్లాడాలని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ..బీజేపీ నేతలు సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డి అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.కాంగ్రెస్ పార్టీ అమరావతికి కట్టుబడి ఉంటుంది అని రాహుల్ గాంధీ చెప్పారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు అన్నారు. అమరావతికి రాష్ట్ర కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతిని నిలబెట్టుకుని తీరుతామని చెప్పారు. ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాంతమిదని... కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ కేంద్ర సంస్థలకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అమరావతి రాజదాని అండగా ఉంటాం అని చెప్పారని స్థానిక జేఏసీ నేతలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications