వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తమను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ మంత్రులు.. ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులివ్వగా, పార్లమెంటులోనూ ఇదే పని చేస్తామని వైసీపీపీపీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు.

ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో కోర్టుల్లో పరువు పోగొట్టుకున్న వైసీపీకి.. ఈ ప్రవిలేజ్ నోటీసుల విషయంలోనూ షాక్ తగులుతుందని ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పంచాయితీ ఎన్నికలు, ఏకగ్రీవాలు, సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ వివాదం తదితర అంశాలను ప్రస్తావించారు. ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనాజడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

మొగుణ్ని కొట్టి.. సామెతలా..

మొగుణ్ని కొట్టి.. సామెతలా..

''ఏపీలో స్థానిక సంస్థల ప్రక్రియ ఆరంభం కాకముందు నుంచే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఉద్దేశించి వైసీపీ నేతలు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. బాధ్యత గల కేబినెట్ మంత్రులైతే మరో అడుగు ముందుకేసి.. నిమ్మగడ్డపై చర్యలు కోరుతూ అసెంబ్లీలో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. మెయిల్ ద్వారా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఈ మేరకు మంత్రులు పంపారు. పార్లమెంటులోనూ ఏపీ ఎస్ఈసీపై ప్రివిలేజ్ మోషన్ పెడతామని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. తమను నిమ్మగడ్డ ఇష్టారీతిగా దూషించి, ఆరోపణలు చేసినందుకే ప్రివిలేజ్ ను ఆశ్రయించామని మా వైసీపీ వాళ్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం.. 'మొగుణ్ని కొట్టి.. మొగసాలకు..'అనే సామెతలా ఉంది. నిజం చెప్పాలంటే..

స్పీకర్ చర్యలకు ముందే సీఎం..

స్పీకర్ చర్యలకు ముందే సీఎం..

ఎస్ఈసీపై ప్రివిలేజ్ మోషనే కాదు.. అవసరమైతే కోర్టులకు కూడా వెళతామని వైసీపీ మంత్రులు, ఎంపీలు చెబుతున్నారు. నిజానికి గడిచిన ఏడాది కాలంగా నిమ్మగడ్డను తీవ్రంగా దూషించింది ఎవరో అందరికీ తెలుసు. రాజ్యాంగ బద్ధ సంస్థను అడుగడుగునా అవమానిస్తూ, తిరిగి ఎస్ఈసీపైనే శాసనసభకు ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే. బహుశా, ఏ పనికిమాలిన వెధవైనా ఇలాంటి సలహా ఇచ్చుంటే, దయచేసి అవాయిడ్ చేయాలని సీఎం జగన్ ను కోరుతున్నాను. సీఎంను ఇంప్రెస్ చేయడానికి స్పీకర్ తమ్మినేని.. మంత్రుల నోటీసులపై చర్యలకు ఉపక్రమించకముందే ఆ ప్రక్రియను జగన్ అడ్డుకోవాలి. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసులంటే అది ఆకాశంపై ఉమ్మేసినట్లే. చివరికది వేసిన వాళ్ల ముఖంపైనే పడుతుంది...

ఉల్లిగడ్డ.. ఆలుగడ్డ.. ఇంకేదో గడ్డ..

ఉల్లిగడ్డ.. ఆలుగడ్డ.. ఇంకేదో గడ్డ..

ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇంటిపేరును ఎద్దేవా చేస్తూ ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇంకేదో గడ్డ అని వైసీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తుంగలో తొక్కుతోన్న వైసీపీ ప్రభుత్వమే.. తిరిని తన ప్రత్యర్థులపై అదే చట్టం కింద కేసులు పెట్టిన చందంగా.. నిమ్మగడ్డను వీళ్లే తిట్టి, మళ్లీ ఆయనపైనే ప్రివిలేజ్ నోటీసులు ఇస్తున్నారు. అయితే ఈ ప్రివిలేజ్ విషయంలో నిమ్మగడ్డ గనుక కోర్టుకు వెళితే జగన్ సర్కారుకు మరోసారి షాక్ తప్పదు. నేను నిమ్మగడ్డను వెనుకేసుకొస్తున్నానని అనుకోవద్దుగానీ.. ఆయన ఏనాడైనా విజయసాయినిగానీ, మంత్రులనుగానీ పల్లెత్తి మాటైనా అనలేదు.

స్పీకర్ గనుక నిమ్మగడ్డపై చర్యలకు ఆదేశిస్తే మళ్లీ ప్రభుత్వానికి కోర్టు ఖర్చులు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాలే రాజ్యాంగ సంస్థలపై చర్యలు తీసుకునే వీలుంటే జగన్.. జడ్జిలపై ఫిర్యాదు లేఖలు ఎందుకు రాస్తారు? కాబట్టి ఇకనైనా ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం..

పంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీపంచాయితీ ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు -జగన్ దిమ్మతిరిగేలా టీడీపీ స్ట్రాటజీ

నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?

నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?

దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో.. అభివృద్ధి లేనప్పటికీ, సంక్షేమాన్ని మాత్రం అద్భుతంగా అమలు చేస్తున్నారని సీఎం జగన్ పట్ల ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీనే గెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నవాళ్లే నమ్మడం లేదు. అందుకే ఏకగ్రీవాలపై అనవసర హడావుడి చేస్తున్నారు. 2009, 2014లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవ స్థానాలకు ఇన్సెటివ్స్ ఇచ్చారు. అప్పుడంటే స్థానిక ఎన్నికలకు నోటా ఆప్షన్ లేదు. బ్యాలెట్ పేపర్ లో నోటాను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, ఇక ఏకగ్రీవాల అవసరం ఏముంది? అయినా ఏకగ్రీవాలంటే గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరిగినట్లుగా కాదని ఎస్ఈసీ సెలవిచ్చారు కూడా. అయినా, ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేక అప్పులు చేస్తున్న సందర్భంలో ఏకగ్రీవాలకు నిధులెక్కడివి. నిజంగా మంచి చేయాలనుకుంటే, గతంలో పనిచేసిన సర్పంచ్ లకు పెండింగ్ నిధులిస్తే చాలు. కాగా,

ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లు

ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లు

ఏకగ్రీవాలపై నెలకొన్న అనవసర సరదాను తీర్చేలా ఎస్ఈసీ నిమ్మగడ్డకు నేనొక వినతి చేస్తున్నాను. ఇప్పటికే తొలి విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది కాబట్టి, మిగిలిన మూడు విడదల్లోనైనా నామినేషన్లను ఆన్ లైన్ పద్ధతిలో స్వీకరించాలి. అప్పుడు బెదిరింపులకు తావు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఒకవేళ ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పిస్తే, వాళ్లను డిస్ క్వాలిఫై చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే గ్రామాల్లో గొడవలే ఉండవు. తద్వారా ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. ఇకపోతే..

Recommended Video

Telangana: Farm Laws వ్యవసాయ చట్టాల పై సలహాలు అడిగిన ఏకైక ప్రభుత్వం BJP నే ! Telangana BJP
సజ్జల సిద్దంగా ఉండాలి మరి..

సజ్జల సిద్దంగా ఉండాలి మరి..

ఏపీ ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండి.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతోన్న కారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరును ఎస్ఈసీ ఆక్షేపించారు. దానికి సరైన వివరణ ఇవ్వాల్సిందిపోయి, తాను ఎప్పటినుంచో పార్టీ మనిషినని, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుతానని, కావాలంటే ఎస్ఈసీ కూడా ఎక్కడైనా కూర్చొని మాట్లాడొచ్చని సజ్జల సెలవిచ్చారు. ఈ వ్యవహారం అంత తేలికైందేమీకాదు. సజ్జల తన రెండు పదవుల్లో ఒకదానిని వదులుకోడానికి సిద్ధంగా ఉండాలి. కాదూ కూడదంటే, గతంలో మాదిరిగానే కోర్టుల్లో అవమానాలు తప్పవు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

English summary
narsapuram ysrcp mp raghurama krishnam raju slam andhra pradesh ministers for issuing assembly privilege notice to sec nimmagadda ramesh kumar. speaking to media on sunday at delhi, the rebel mp also criticizes cm jagan and govt advisor sajjala ramakrishna reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X