వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్ -ఒడిశా పోలీసుల అలజడి -కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 -ఈసీకీ నో ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకుగానూ అన్ని జిల్లాల్లో కలిపి 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ఇవాళ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 6,942 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 6,314, అత్యంత సమస్యాత్మక బూత్ లు 6,314, నక్సల్స్ ప్రభావిత కేంద్రాలు 247 ఉన్నాయి. అయితే, అనూహ్యరీతిలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కోటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది.

ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ

కోటియా గ్రామాల్లో సెక్షన్ 144

కోటియా గ్రామాల్లో సెక్షన్ 144

ఆంధ్రా, ఒడిశా మధ్య కొఠియా గ్రూపు గ్రామాలపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామాలు మావంటే మావంటూ రెండు రాష్ట్రాలూ తగువులాడుకుంటోన్న క్రమంలో ఇవాళ జరిగే ఏపీ పరిషత్‌ ఎన్నికలను అడ్డుకోడానికి ఒడిశా ప్రభుత్వ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకంగా 22 కోటియా గ్రామాల్లో బుధవారం నుంచే సెక్షన్ 144 విధించి, జనం కదలికలపై ఆంక్షలు పెట్టింది. పోలింగ్‌ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక అధికారులు, ఐటీడీఏ పీవో రంగంలోకి దిగి ఒడిశా యంత్రాంగంతో చర్చలు జరిపారు.

viral video: ఖాకీల రాక్షసం -మాస్కు సరిగా పెట్టుకోలేదని వ్యక్తిపై భయానక దాడి -చిన్న పిల్లాడు వేడుకున్నా..viral video: ఖాకీల రాక్షసం -మాస్కు సరిగా పెట్టుకోలేదని వ్యక్తిపై భయానక దాడి -చిన్న పిల్లాడు వేడుకున్నా..

తొలిసారి పోలింగ్ అడ్డగింత..

తొలిసారి పోలింగ్ అడ్డగింత..

కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అక్తర్‌ ఆదేశాల మేరకు 22 కోటియా గ్రామాల్లో సెక్షన్ 144 విధించారు. గంజాయిభద్ర పరిధిలోని నేరెళ్లవలసలో గ్రామస్థులను బయటకు రానీయకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఎగువ, దిగువ గంజాయిభద్ర, కొటియా, దూళిభద్ర, ఎగువ, దిగువశెంబి తదితర గ్రామస్థులను ఓటింగ్‌కు హాజరుకావొద్దని ఒడిశా అధికారులు ఆంక్షలు విధించారు. కోటియా గ్రామాల సరిహద్దులను దాదాపు మూసేశారు. నేరెళ్లవలసలో గంజాయిభద్ర పంచాయతీకి చెందిన 1,291 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 628 మంది పురుషులు, 663 మంది మహిళలు. వివాదాస్పద గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు ఎన్నికలను నిర్వహిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఎన్నికలను మరో రాష్ట్రం ఎప్పుడూ అడ్డుకోలేదు. తొలిసారి ఏపీ స్థానిక ఎన్నికలపై ఒడిశా కన్నెర్రచేస్తోంది.

ఎక్కడున్నాయీ కోటియా గ్రామాలు?

ఎక్కడున్నాయీ కోటియా గ్రామాలు?


ఏపీలోని విజయనగరం - ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల మధ్య ఉండే కొటియా పంచాయతీలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు. విజయనగరం నుంచి 60 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తే కొటియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగకపోవడం, వాటిని ఏ ప్రాంతాల్లోనూ కలపకపోవడంతో అవి తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. ఈ వివాదం 1968లోనే సుప్రీంకోర్టును చేరగా, వ్యవహారం తేలాల్సింది కోర్టులో కాదని, పార్లమెంట్‌లోనే అని అత్యున్నత న్యాస్థానం 2006లో పేర్కొంది. విలువైన ఖనిజ సంపదకు నిలయమైన ఆ ప్రాంతాన్ని వదులుకునేందుకు రెండు రాష్ట్రాలూ సిద్ధంగా లేవు. అయితే, ఎన్నికల పోలింగ్ సమయంలో అడ్డగింతలు జరగడం మాత్రం ఇదే తొలిసారి. నిన్న..

ఒడిశా పార్టీల నేతల హంగామా

ఒడిశా పార్టీల నేతల హంగామా


నిజానికి పంచాయితీ ఎన్నికల సమయంలోనే గంజాయిభద్ర, పగులుచెన్నారు, పట్టుచెన్నారులో వాటిని నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో దండోపాయంతోనైనా ఏపీ పరిషత్ ఎన్నికలను అడ్డుకోవాలని ఒడిశా యంత్రాంగం ఆంక్షలు విధించి, భారీ ఎత్తున పోలీసు బలగాలను దించింది. ప్రభుత్వ యంత్రాంగమేకాదు, ఒడిశాకు చెందిన పలు రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోటియా గ్రామాల్లో పర్యటించి ఏపీ ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. కాగా, ఒడిశా చేస్తున్న ప్రయత్నాలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఇదిలా ఉంటే..

Recommended Video

#Weather Changed Drastically In Paderu Visakhapatnam
శ్రీకాకుళం సరిహద్దులోనూ వివాదం..

శ్రీకాకుళం సరిహద్దులోనూ వివాదం..

విజయనగరం -కోరాపూట్ జిల్లాల మధ్య కోటియా గ్రామాల వివాదం కొనసాగుతుండగా, ఆంధ్ర -ఒడిశా సరిహద్దులోనే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కౌశల్యాపురం పోలింగ్‌ స్టేషన్‌ వద్ద రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేయగా, ఒడిశా అధికారులు అక్కడికి వచ్చి.. భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దీనిపై సీతంపేట ఐటీడీఏ పీవో జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.

English summary
amid ap parishad elections, border dispute between andhra pradesh and odisha, tense erupts in bordering kotia village. odisha officials clamped Section 144 in 22 Kotia villages to discourage people from AP poll. andhra on thursday will cast parishad elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X