'అసెంబ్లీ ప్రసారాలకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వాలి, ఫిర్యాదు'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు సిగ్గుచేటని, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను ఇళ్లలోని మహిళలు, పిల్లలు చూడలేని పరిస్ధితి నెలకొందని ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో చిత్తూరు జిల్లాలో గత ఐదు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష ముగింపు సభకు రఘవీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాగాలేదన్నారు.

ముఖ్యంగా ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. సమావేశాలకు కుటుంబసమేతంగా చూడలేని పరిస్ధితి వచ్చిందని, సమావేశ ప్రసారాలకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వాలని గవర్నర్ నరసింహాన్‌ను కోరనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చట్టపరంగా రావాల్సిన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications