జగన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఆపలేదు- షర్మిల..!!

ఏపీ రాజకీయాల్లో జగన్ పల్నాడు పర్యటన ఇప్పుడు వివాదంగా మారుతోంది. జగన్ పర్యటన పైన ఆంక్షలు విధించినా.. ఇంత మంది జనం రావటం ఏంటని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ పర్యటన వేళ వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వారి పైన పోలీసులు కేసులు నమోదు చేసారు. ప్రభుత్వం తన పర్యటన పైన ఆంక్షలు విధించిన కారణంగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారని జగన్ చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు జగన్ పర్యటనకు భారీ గా జనం రావటం పైన షర్మిల ప్రభుత్వాన్ని.. పోలీసు అధికారులను నిలదీసారు.

జగన్ పల్నాడు పర్యటన పైన పీసీసీ చీఫ్ షర్మల స్పందించారు. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకు న్న వాళ్ళకు జగన్ పరామర్శ చేయడం ఏంటిని ప్రశ్నించారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరా టం చేయాలని... బల ప్రదర్శనలు కాదని పేర్కొన్నారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి..అన్ని అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవో చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు ఆంక్షలు కాంగ్రెస్ పార్టికేనా అంటూ నిలదీసారు. తాము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ లు చేస్తారని..స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ap-pcc-chief-ys-sharmila-seriously-reacts-on-ys-jagan-palnadu-tour

ఆంక్షలు అన్ని కాంగ్రెస్ పార్టీకేనా అని షర్మిల నిలదీసారు. బీజేపీ కి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు కాంగ్రెస్ ను అడ్డుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పరామర్శ ల పేరు మీద చేసే యాత్రలకు ఆంక్షలు ఉండవా అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ మోడీ దత్త పుత్రుడు అని ఆంక్షలు పెట్టడం లేదా అని అడిగారు. జగన్ మీద ఎందుకు ఆంక్షలు లేవో చెప్పాలని డిమాండ్ చేసారు. బల ప్రదర్శన మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని నిలదీసారు.

జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా ? చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. జగన్ బల ప్రద శన లో ఇద్దరు చనిపోయారన్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవ్వరని షర్మిల ప్రశ్నించారు. 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు వేల మంది ఎలా వచ్చారని ప్రశ్నించిన షర్మిల.. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. గన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఆపలేదని ప్రశ్నించారు. బీజేపీ తో జగన్ అక్రమ పొత్తు కాబట్టి ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+