'ఇద్దరు నాయుళ్లు పిరికిపందలు', అమిత్ షా పన్నిన వ్యూహంలో బాబు
విజయవాడ: ప్రత్యేక హోదా విషయమై ప్రధాని నరేంద్ర మోడీని అడిగేందుకు కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబులు భయపడుతున్నారని, ఢిల్లీ నాయుడు, గల్లీ నాయుడులు ఇద్దరు పిరికిపందలేనని సీపీఐ నేత రామకృష్ణ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఏపీకి వీఐపీ హోదా: బీజేపీ కొత్త ట్విస్ట్‌లు, పవన్ దెబ్బకి దిగొచ్చిన 'బీజేపీ'!
హోదా పైన మాట తప్పిన టిడిపి, బిజెపి నేతలు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పోరాడుతున్న వారి పైన ఎదురు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నామని వెంకయ్య చెబితే, చంద్రబాబు మాత్రం రూ.70వేల కోట్లు వస్తాయని చెబుతున్నారన్నారు.

ఇద్దరు నాయుడులు తలోమాట చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై మేధావులు, పాత్రికేయులు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని కేంద్రమంత్రులు వెంకయ్య, సుజనా చౌదరి చెప్పడం సరికాదన్నారు. వెంకయ్య, చంద్రబాబు చేతకానితనం వల్లే హోదా కావాలని ప్రధాని మోడీని అడగలేక పోతున్నారన్నారు.
పార్లమెంటులో 13 పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడినప్పుడు వారితో కలిసి మోడీని హోదా అడిగి ఉంటే వచ్చేదన్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఐదు స్టేట్‌మెంట్లు ఇచ్చి, ఐదు రకాలుగా మాట్లాడారన్నారు. అందులో దేనిని నమ్మాలో చెప్పాలన్నారు. హోదా ఇవ్వకుంటే విశాఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఏం జరిగిందో అన్నిచోట్ల అదే జరుగుతుందన్నారు. వదిలే ప్రసక్తి లేదన్నారు.
పవన్-మోడీ మధ్య చిచ్చు: ట్విస్ట్... దెబ్బకి వెంకయ్య రివర్స్!
సిపిఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. చంద్రబాబు బీజేపీ మాయలో పడ్డారన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ చాలన్న కేంద్ర మంత్రుల వాదనకు కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిలో చేసిన ప్రకటన ఉందన్నారు.
ఏపీపై పట్టు సాధించేందుకు మోడీ, అమిత్ షా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు, ఏపీ ప్రజలను మోసం చేయడంలో వారికి సహకరిస్తున్నారన్నారు. ప్యాకేజీ కేంద్రం ప్రకటించగానే రాజధాని నిర్మాణానికి మాత్రమే రూ.5లక్షల కోట్లు అవసరమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రూ.70వేల కోట్లకు ఎందుకు సంతృప్తి పడ్డారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications