వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ? టీడీపీ ఆరోపణల్ని నిర్దారించిన వైసీపీ ఎమ్మెల్యే !

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మరోసారి కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఇంతకాలం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తాజాగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే ఒకరు తాజాగా నిర్దారించడం సంచలనం రేపుతోంది.

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రత్యర్ధులతో పాటు సొంత పార్టీ నేతలపైనా ఫోన్ ట్యాపింగ్ పెడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇవే ఆరోపణలు రాగా.. ఇప్పుడు వైసీపీ సర్కార్ పైనా టీడీపీ అవే ఆరోపణలు గుప్పిస్తోంది. అదే సమయంలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే ఒకరు తాజాగా వీటిని సమర్ధించేలా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఫోన్ ట్యాపింగ్

ఏపీలో ఫోన్ ట్యాపింగ్

ఏపీలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీలోని కీలక నేతల కదలికలపై వైసీపీ సర్కార్ నిఘా పెట్టిందన్న ఆరోపణల్ని విపక్షం ఎప్పటి నుంచో చేస్తోంది. అదే సమయంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా బహిరంగంగానే తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం ముదురుతోంది. ఇన్నాళ్లూ టీడీపీ విపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని లైట్ తీసుకున్న వారు సైతం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ తో ఇది నిజమేనని నమ్మే పరిస్ధితి వస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ?

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ?

కొంతకాలంగా వైసీపీ అధిష్టానంతో అసంతృప్తిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెరపైకి తెచ్చారు. తాజాగా తన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే బహిరంగంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు. 8 నెలల నుంచి ప్రభుత్వం తన ఫోన్లు ట్యాప్ చేస్తోందని, దీంతో తాను 12 సిమ్ లు మార్చాల్సి వచ్చిందన్నారు. అంతే కాదు ఇవే కారణాలతో పార్టీని వీడేందుకు సైతం సిద్ధపడ్డారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వంపై చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు అధికార పార్టీతో పాటు విపక్షాల్నీ కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ టీడీపీ చేసిన ఆరోపణల్ని సమర్ధించేలా ఉన్న కోటంరెడ్డి కామెంట్స్ ను టీడీపీ తమకు అనుకూలంగా వాడుకుంటోంది.

కోటంరెడ్డి అనుమానాల వెనుక ?

కోటంరెడ్డి అనుమానాల వెనుక ?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సీఎం జగన్ వద్దకు వెళ్లిన కోటంరెడ్డి.. అక్కడ ఆయన చెప్పిన విషయాలు చూసి కంగుతిన్నారు. స్ధానికంగా జరుగుతున్న పరిణామాలన్నీ పూసగుచ్చినట్లు సీఎం జగన్ చెబుతుంటే కోటంరెడ్డి షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ జరిగితే తప్ప ఈ విషయాలు బయటికి వచ్చే అవకాశం లేదని ఆయన గుర్తించారు. అందుకే తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని కోటంరెడ్డి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా అంతిమంగా టీడీపీకి వరంగా మారింది.

ఇంటెలిజెన్స్ ఛీఫ్ ను టార్గెట్ చేసిన టీడీపీ ?

ఇంటెలిజెన్స్ ఛీఫ్ ను టార్గెట్ చేసిన టీడీపీ ?


తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చింది. ఫోన్ ట్యాపింగ్ పై సొంతపార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కుపాల్పడుతున్న ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని టీడీపీ నేత వర్ల డిమాండ్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకసూత్రధారి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెంటనే తనపదవికి రాజీనామా చేయాలన్నారు. ఇంటిలిజెన్స్ చీఫ్ కి ఫోన్ ట్యాపింగే పెద్ద పని అయిపోయిందని, చంద్రబాబు అలా మాట్లాడాడు... ఇంకొకా యన ఇలా మాట్లాడాడని ముఖ్యమంత్రి చెవికొరకడమే ఆయనకు పనిగా మారిందన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేం అరెస్ట్ అయి జైల్లో చిప్పకూడు తిన్నవాళ్లమా?.. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లేవాళ్లమా.. పరిస్థితులు అటూఇటూ అయితే మరలా జైలుకెళ్లేవాళ్లమా? అని వర్ల ప్రశ్నించారు.

English summary
phone tapping allegations once again erupted in ap politics with ysrcp mla kotamreddy sridhar reddy's recent comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X