పోసాని కృష్ణమురళి అరెస్ట్

సినీనటుడు పోసాని కృష్ణమురళీ అరెస్టయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు మైహోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం పోసానిని అరెస్ట్ చేశారు.

పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో 196, 35(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై తన సిబ్బందితో రాయదుర్గం చేరుకుని పోసానిని అరెస్ట్ చేశారు.

గురువారం ఉదయానికి పోసానిని ఓబులవారిపల్లెకు తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరిచనున్నట్లు సమాచారం. కాగా, అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో అతికష్టం మీద పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పోసానిని భోజనం కూడా చేయనీయకుండా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

పోసానిపై ఏపీ వ్యాప్తంగా కేసులు

కాగా, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళీపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు నకూడా పోసానిపై నమోదు కావడం గమనార్హం.

AP Police arrest Posani Krishna Murali

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అభ్యంతరకరంా దూషణలు చేశారంటూ కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.

తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులు అందాయి. దీంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన పోసాని కృష్ణమురళి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+