ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు రిలీజ్..
ఆంధ్రప్రదేశ్‌లో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను APSLPRB అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఈ ఫలితాల్లో గండి నానాజి అత్యధికంగా 168 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. రెండో స్థానంలో జి. రమ్య మాధురి 159 మార్కులు.. మూడో స్థానంలో మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ ఆర్.కె. మీనా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, శారీరక ప్రమాణాలు (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వంటి దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 4.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితర దశలకు హాజరు కావలసి ఉంటుంది. అనంతరం శిక్షణకు పంపుతారు. ఫలితాలపై సందేహాలుంటే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని హెల్ప్‌డెస్క్ ద్వారా సమాచారం పొందవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు, ట్రైనింగ్ అకాడమీలు, స్పెషల్ యూనిట్లలో వీరు నియమించబడతారు. సమగ్రంగా, పారదర్శకంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడం గర్వంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications