రాజస్థాన్‌లో ఏపీ పోలీసుల ఎన్‌కౌంటర్: దొంగ భీమ్‌సింగ్‌తో మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జానూర్‌లో శుక్రవారం నాడు ఏపీ పోలీసుల కాల్పుల్లో భీమ్‌సింగ్‌ అనే దొంగ మృతి చెందాడు. ఈఘటనలో భీమ్‌సింగ్‌తో పాటు ఆయన డ్రైవర్‌ కూడ మృతి చెందారని పోలీసులు చెప్పారు.

గత నెలలో డోన్‌ హైవేపై రూ. 5 కోట్లను దోచుకొన్న భీమ్‌సింగ్ . భీమ్‌సింగ్ కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. భీమ్‌సింగ్ కోసం రాజస్థాన్‌ రాష్ట్రంలోని జానూర్‌ పట్టణంలో ఏపీ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు.

Ap police encounter thief Bhimsingh in Rajastan

ఏపీ పోలీసులు చుట్టుముట్టడంతో భీమ్‌సింగ్‌ పోలీసులపై కాల్పులు జరపడంతో ఏపీ పోలీసులు కూడ భీమ్‌సింగ్‌పై కాల్పులకు దిగారు.

కాల్పులు జరుపుతూ భీమ్‌సింగ్ తప్పించుకొనేందుకు ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో భీమ్‌సింగ్‌తో పాటు ఆయన డ్రైవర్‌ కూడ మరణించారు.భీమ్‌సింగ్‌పై 144 కేసులున్నాయి.

హైద్రాబాద్ బెంగుళూరు దారిలో ప్రతి రోజూ బంగారం వ్యాపారులు కోట్లాది రూపాయాలను బంగారం మార్పిడి చేసుకొంటూ వస్తారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన భీమ్‌సింగ్ ముఠా గత నెలలో డోన్ వద్ద వాహనాన్ని ఆపి రూ.5 కోట్లను దోచుకెళ్ళారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh police encountered thief Bhimsingh and his driver in Rajastan state on Friday. Bhimsingh theft Rs. 5 crore in Kurnool district lastmonth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి