కొడాలి నానికి బిగిస్తున్న ఉచ్చు - తాజా నిర్ణయంతో..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో జగన్ అరెస్ట్ పైనా ప్రచారం సాగుతోంది. కాగా, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని కి ఉచ్చు బిగిస్తోంది. కొత్తగా మరో కేసు నమోదైంది. దీంతో, కొడాలి నాని విషయంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మాజీ మంత్రి కొడాలి నాని పైన తాజాగా మరో కేసు నమోదు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా కొడాలి నాని కేసుల పైనే చర్చ జరిగింది. న్యాయస్థానం ఆశ్రయించిన కొడాలి నాని ఆ తరువాత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ కు పరిమితం అయ్యారు. ముంబాయిలో నానికి గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది.

ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పలు కేసుల విషయంలో కోర్టు కండీషన్ల మేరకు పోలీసు స్టేషన్ల కు వెళ్లి సంతకాలు చేస్తున్నారు. గుడివాడకు వచ్చిన సమయంలో పార్టీ నేతలను కలుస్తున్నారు. చాలా రోజులు జైలులో ఉన్న వల్లభనేని వంశీ విడుదల తరువాత వెళ్లి కలిసారు. ఇక, ఇప్పుడు మరో కేసు తెర మీదకు వచ్చింది.
మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు,.. కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనాప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT యాక్టు కింద నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన 41 సీఆర్‌పీసీ నోటీసులను గుడివాడలోని కొడాని నాని ఇంటికి వెళ్లి ఆదివారం అందజేశారు. ఇప్పటికే పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న కొడాలి నాని ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications