Exclusive:బీజేపీ 'మెగా' అస్త్రం - చిరంజీవికి తాజా ఆఫర్, పవన్ సై..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగానే కొనసాగుతూ మూడు పార్టీలు తమ సొంత బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీపైన బీజేపీ కేంద్ర నాయకత్వం మెగా ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇప్పటికే పవన్ నుంచి మోదీ నాయకత్వా నికి పూర్తి మద్దతు ఉంది. దీంతో, చిరంజీవి తమతో భవిష్యత్ రాజకీయంగా కలిసి వచ్చేందుకు భారీ స్కెచ్ అమలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా సాగిన తాజా మంత్రాంగంలో చిరంజీవికి భారీ ఆఫర్ వచ్చింది. పవన్ సైతం బీజేపీ ప్లాన్ కు పై అంటున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ జరిగేదేంటి.

ఏపీ పై మోదీ స్కెచ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నాయకత్వానికి ఏపీ పైన రాజకీయంగా ఆశలు పెరిగాయి. ఎంతో కాలంగా ఏపీలో ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు కలిసి రాలేదు. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల వేళ తాము ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం మెగా మద్దతు కోసం అనేక రకాల ఫీట్స్ చేస్తోంది. పవన్ ను పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రశంసించిన మోదీ..ఈ మధ్య కాలంలో చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ.. మెగా బ్రదర్స్ ఇద్దరితో కలిసి ప్రధాని అభివాదం చేసిన సమయంలోనే బీజేపీ భవిష్యత్ ప్రణాళికల పైన స్పష్టమైన సంకేతాలుగా భావించారు.

AP Politics BJP Plans to Induct Chiranjeevi into Union Cabinet Pawan Kalyan Supports

చిరంజీవికి ప్రాధాన్యత
జగన్ సీఎంగా ఉన్న సమయంలో నర్సాపురంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ వేళ చిరంజీవికి ప్రాధాన్యత దక్కింది. అదే విధంగా అయోధ్య రామాలయ ప్రారంభానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఇక, తాజాగా ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుక ల్లో చిరంజీవి హాజరయ్యారు. అక్కడ ప్రధాని - మెగా కాంబినేషన్ పైన ఏపీ భవిష్యత్ రాజకీయాల పైన చర్చ మొదలైంది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు తరువాత అమిత్ షా తో చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక.. ఇప్పుడు చిరంజీవికి బీజేపీ నాయకత్వం నుంచి తాజా ఆఫర్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. దీని పైన ఇప్పుడు చిరంజీవి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బీజేపీ మెగా వ్యూహం
రాజకీయంగా ఏపీతో పాటుగా జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. ఇందు కోసం మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం వేళ సనాతన హిందూ ధర్మం గురించి చర్చ ద్వారా పవన్ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రాజకీయం గా ఎదిగే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి వర్గంలోకి చిరంజీవి చేరనున్నారనే వార్తలు ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వచ్చిన ప్రతిపాదనకు అంగీకరిస్తే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు. దీంతో, మరో రెండు నెలల్లో ఏపీ కేంద్రంగా మెగా బ్రదర్స్ రాజకీయ భవిష్యత్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+