భువనేశ్వరి ములాఖత్ అందుకే నిరాకరించాం-ఏపీ జైళ్ల శాఖ వివరణ..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఐడీ రిమాండ్ కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో ములాఖత్ ల వ్యవహారం వివాదం రేపింది. ఇవాళ చంద్రబాబు భార్య భువనేశ్వరిని ములాఖత్ కు అనుమతించకపోవడంతో వివాదం రేగింది. వారానికి మూడుసార్లు ములాఖత్ లో కలిసే అవకాశం ఉన్నా తనను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అడ్డుకుందని భువనేశ్వరి అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబును ములాఖత్ లో కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరిని అనుమతించని వ్యవహారంపై జైళ్ల శాఖ ఇవాళ స్పందించింది. ఈ మేరకు జైళ్ల శాఖ తరఫున ఉపశాఖాధికారి వివరణ ఇచ్చారు. నారా భువనేశ్వరిని చంద్రబాబు ములాఖత్ కు ఇవాళ అనుమతించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆయన వెల్లడించారు. అలాగే వారంలో మూడు ములాఖత్ లకు అనుమతి అంటూ జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు.

 nara bhuvaneswari

ఇవాళ ఉదయం భువనేశ్వరి చంద్రబాబును కలిసేందుకు ములాఖత్ దరఖాస్తు పెట్టుకున్నారని, అయితే దాన్ని తాము తిరస్కరించిన మాట వాస్తమమేనని తెలిపారు. రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడవ ములాఖత్ మంజూరు చేస్తారని తెలిపారు. కానీ భువనేశ్వరి మాత్రం సదరు అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించలేదన్నారు.

భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తులో అత్యవసరణ కారణాన్ని ప్రస్తావించి ఉంటే అనుమతి లభించి ఉండేదన్న అంశాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో భువనేశ్వరికి ములాఖత్ నిరాకరణపై టీడీపీ వర్గాలకు కూడా క్లారిటీ వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి తగిన కారణాలతో ములాఖత్ కోరే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+