ఏపీని చలికాలంలోనూ వర్షాలతో వణికిస్తున్న బంగాళాఖాతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్న సమయంలో కూడా వర్షాలు కురవడం ఏపీ వాసులకు ఆందోళన కలిగిస్తుంది. .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నిత్యం వర్షాలు ఏపీవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో కురుస్తున్న విషయం తెలిసిందే. నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో వర్షాలు
ఏపీ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తో పాటు నేడు నైరుతి బంగాళాఖాతంలో కూడా ప్రతి ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు
ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఇది 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు యానంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
దక్షిణ, ఉత్తరకోస్తాలలో ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. నేడు అల్లూరి సీతారామరాజు, కృష్ణ, నెల్లూరు, అన్నమయ్య, విశాఖపట్నం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
రేపు ఈ జిల్లాలలో వర్షాలు
రేపు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏది ఏమైనా ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications