ఏపీలో ఫెంగల్ తుఫాను బీభత్సం.. ఈ జిల్లాలలో భారీవర్షాలు, ఆకస్మిక వరదలు.. తాజా హెచ్చరికలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటింది. నిన్న రాత్రి 10:30 నుండి 11:30 మధ్య పుదుచ్చేది సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటింది. అది ప్రస్తుతం ఉధృతంగా కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం
వర్షాలు కురిసే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటిన సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరంపైకి వచ్చాక మళ్ళీ తీవ్ర వాయుగుండంగా ఇది బలహీన పడనుంది.ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ap rains update Cyclone Fengal effect on AP Heavy rains and flash floods in these districts

నేడు, రేపు జోరువానలు
ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓవైపు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రం తో పాటు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.

ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ఇక ఆది, సోమవారాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆది, సోమవారాలలో అంటే నేడు రేపు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలలో ఆకస్మిక వరదలకు ఛాన్స్
అంతే కాదు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, వైయస్సార్ జిల్లా, చిత్తూరు జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. సముద్రతీర ప్రాంతాలలో ఉన్న మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు ఆరవ నెంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు మూడవ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు.

నిన్న తిరుపతిలో భారీ వర్షం
ఇదిలా ఉంటే తుఫాను ప్రభావంతో నిన్న నిరంతరాయంగా తిరుమలలో వర్షం కురిసింది. తిరుమల నుంచి శ్రీవారి పాదాలు పాప వినాశనం వెళ్లే మార్గాలను వర్షం కారణంగా మూసివేశారు. శనివారం రోజు తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో 13.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. నారాయణవనం, ఏర్పేడు, కేవీపీ పురం మండలాల పరిధిలో కాజ్ వే పైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు
వర్షాల కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు ప్రభావం ఉన్న జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఫెంగల్ తుఫాన్ పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించి విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు . ఆకస్మిక వరదలు వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+