జులై 31వరకు తగ్గేదేలే.. ఏపీకి బంగాళాఖాతం వర్ష హెచ్చరిక!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి . ఒడిస్సామీదుగా తూర్పు, పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసాయి. రాయలసీమలోను చెదురుమదురుగా వర్షాలు కురిసాయి. ఇక వచ్చే 24 గంటల్లోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు ఈ జిల్లాలలోనే వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

AP rains updates ap rains upto july 31st latest situation of godavari floods

జులై 31 వరకు వానలే.. వీరికి అలెర్ట్
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో జూలై 31 వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు గోదావరి వరద నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

గోదావరి వరద ఉధృతి
అత్యవసర సహాయ చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1070, 112, 1800425 0101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం గోదావరి వరద కొనసాగుతుందని, భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 50.9 అడుగులుగా ఉందని, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ ఫ్లోర్ 12.49 లక్షల క్యూసెక్కుల నీరుగా ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ పేర్కొన్నారు.

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంద,ని విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్లో రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు .గోదావరి పర్యవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ను ఆనుకుని మరో అల్పపీడనం
కాగా ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది .అయితే దీని ప్రభావం రాష్ట్రం పై ఉండే అవకాశం లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+