లాక్ డౌన్ వేళ ఏపీ రాజ్ భవన్ పై ఎగిరిన డ్రోన్లు - ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఓవైపు కరోనా వైరస్ కారణంగా విజయవాడలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా కాపలా కాస్తున్నారు. అదే సమయంలో పటిష్ట భధ్రత మధ్య ఉండే రాజ్ భవన్ పై డ్రోన్ కెమెరాలు ఎగురుతున్నాయి. దీంతో అందరూ ఒక్క సారిగా ఆశ్చర్య పోయారు. నిత్యం ప్రశాంతంగా ఉండే విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఇవాళ డ్రోన్ కెమెరాలు చూడగానే స్ధానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

Recommended Video
విషయం ఏమిటో తెలుసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు రాజ్ భవన్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని డిస్ ఇన్ ఫెక్షన్ చర్యలను చేపట్టారని అర్ధమైంది. అదీ డ్రోన్ కెమెరాల సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని రాజ్ భవన్ లోని భవనాలపై చల్లినట్లు తెలిసింది. ఇప్పటికే విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు వంద దాటి పోవడం, రాజ్ భవన్ చుట్టు పక్కల రెడ్ జోన్లు, హాట్ స్పాట్లు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఎందుకైనా మంచిదని ఇవాళ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. త్వరలో రాజ్ భవన్ లో మరిన్ని కరోనా నియంత్రణ చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications