ఏపీలో పతాకస్ధాయికి కరోనా - 24 గంటల్లో 5 వేల కేసులు..62 మంది మృతి....

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా వ్యాప్తిలో రాష్ట్రం రోజుకో కొత్త రికార్డు నెలకోల్పుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా పశ్చిమగోదావరి 623, గుంటూరు 577, చిత్తూరు 560 కేసులతో టాప్ 3లో నిలిచాయి.

ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 524, కర్నూలు 515, అనంతపూర్ 458 ఉన్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 58668కి చేరుకుంది. ఇందులో 25574 మంది డిశ్చార్జ్ కాగా.. మరో 32336 మంది ఇంకా చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తాజా బులిటెన్ లో పేర్కొంది.

ap records 4944 new covid 19 cases and 62 deaths in last 24 hours

మరోవైపు కరోనా కారణంగా రాష్ట్రంలో నమోదవుతున్న మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 62 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో పది మంది చనిపోయారు.

ఆ తర్వాత విశాఖలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురం,, పశ్చిమగోదావరిలో ఆరుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కర్నూల్లో నలుగురు, కడప, విజయనగరంలో ఒక్కరు చొప్పన చనిపోయారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 758 మంది మృత్యువాత పడినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+