వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప్పులే ఏపీకి ఆధారం కానున్నాయి. రాష్ట్రంలో రెవిన్యూ పైన ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. అదే సమయంలో ఆదాయం తెచ్చే శాఖల అధికారులతో రెవిన్యూ వివరాలను సేకరించారు. వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖలపై సీఎం సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులను విభాగాల వారీగా నివేదించిన అధికారులు.. ఆదాయ లక్ష్యాలు..సాధించిన ఫలితాలను వివరించారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి అనేక కారణాలను ప్రస్తావించారు. సెప్టెంబర్ రెండో తేదీ నుండి రచ్చబండ ప్రారంభం అవుతుండటంతో ఆ సమయానికి సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తంగా ఏపీలో ఆర్దిక పరిస్థితి పరిగణలోకి తీసుకుంటే అప్పులు తప్పేలా లేవు.

వాణిజ్య పన్నుల్లో తగ్గిన వృద్ధి రేటు..

వాణిజ్య పన్నుల్లో తగ్గిన వృద్ధి రేటు..

ముఖ్యమంత్రి నిర్వహించిన రెవిన్యూ విభాగాల సమీక్ష లో శాఖల వారీగా పురోగతి నివేదికలను అందచేసారు. అందులో 14 శాతం ఉండాల్సిన వాణిజ్య పన్నుల వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత స్థాయిలో వృద్ధి లేదని అధికారులు నివేదించారు. స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందని వివరించారు. సిమెంట్ రేట్లు తగ్గటం వలన దాని మీద వచ్చే పన్నులు తగ్గుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. వాహన రంగంలో మందగమనం వలన జీఎస్టీ తగ్గిందని ముఖ్యమంత్రి కి నివేదించారు. కానీ, ఆర్దిక సంవత్సరం చివరికి ఆశించిన స్థాయిలో రెవిన్యూ పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేసారు. జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటివారంలో రూ.597కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేసారు. ఆర్దిక సంవత్సరం ముగింపు నాటికి వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేసారు.

గణనీయంగా తగ్గిన లిక్కర్ వినియోగం..

గణనీయంగా తగ్గిన లిక్కర్ వినియోగం..

ముఖ్యమంత్రి సమీక్షలో లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గినట్లుగా అధికారులు వివరించారు. 2018-2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం జరగ్గా.. బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని లెక్కలు చెప్పారు. అదే విధంగా ప్రయివేటు దుకాణాలు తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 4380 నుంచి 3500కు దుకాణాలు తగ్గిస్తున్నామని.. మొత్తం 20 శఆతం మేర దుకాణాలు తగ్గిస్తున్నట్లుగా స్పష్టం చేసారు. మద్యనియంత్రణ, నిషేధానికి, మరియు డీఎడిక్షన్‌ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా 16వేల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ ముఖ్యమంత్రికి నివేదించారు.

మద్య నియంత్రణకు చర్యలు తీసుకోండి..

మద్య నియంత్రణకు చర్యలు తీసుకోండి..

మద్య నియంత్రణ.. నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ తో పాటుగా పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. స్మగ్లింగ్‌ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలని సూచించారు. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో ఉంచాలని సీఎం ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.
మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను వినియోగించాలని ముఖ్యమంద్రి దిశా నిర్ధేశం చేసారు. ఇక, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని..దీని పైన కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

English summary
AP Revenue situation is in crisis. Officials given report to CM jagan on four months revenue status in earning deptmts.Liquor sales huge down compare to previous year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X