జగన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు..!!
ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం అరుదైన గుర్తింపు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కి యునైటెడ్ నేషన్స్ ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు దక్కింది. ఈజిప్టులో నవంబర్ 5,6 తేదీల్లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ 2022 కి ప్రతిష్టాత్మకమైన 'ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు' లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ మరియు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో రైతు సాధికర సంస్థ కు ప్రపంచ స్థాయిలో ఈ గుర్తింపు దక్కింది.
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రైతు సాధికర సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ సూత్రాలను అమలు చేస్తోంది. సంస్థ తరపున, పునరుత్పత్తి వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న విజయ్ కుమార్, ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సెమినార్‌లో ప్రసంగించారు. రైతు సాధికారిక సంస్థ కార్యక్రమాల పైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్బీకే కేంద్రాలకు గుర్తింపు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్య - విద్య రంగాల్లో అమలు చేస్తున్న విధానాలకు కూడా చాలాసార్లు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.

అయితే ఇదే సెప్టెంబర్ లో రైతు సాధికర సంస్థ కి సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో 'జైవిక్ ఇండియా అవార్డ్స్, ఆర్గానిక్ ఫుడ్ ఇండియన్ కాంటెస్ట్ 2022' లాంటి పాన్ ఇండియా అవార్డు కూడా లభించింది. ఇటు సీఎం జగన్ వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్ ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్దేశించారు.
రబీ సీజన్‌కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ జరగాలని ఆదేశించారు. ఈ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలన్నారు. వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications