• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఆయన బూట్లు తుడుస్తా.. కాళ్ల దగ్గర కూర్చుంటా: కొడాలి నాని సవాల్

|

అమరావతి: రాష్ట్రంలో ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. మొన్నటిదాకా రాజకీయపరమైన ఒత్తిళ్లు, కోర్టుల్లో ఎదురైన ప్రతికూల తీర్పులతో ఒకింత డీలా పడినట్లు కనిపించిన పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఓట్లను పొందడాన్ని అసాధారణంగా అభివర్ణిస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రజలు తమవైపే ఉన్నారని, ఇక ముందు ఉంటారని కూడా చెబుతున్నారు.

 చెలరేగిన కొడాలి నాని

చెలరేగిన కొడాలి నాని


జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీ స్థానాలను గెలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. రెండున్నరేళ్ల తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అనేవి లేవనే విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని అన్నారు. నగరాలు మొదలుకుని గ్రామాల ద్వారా అన్ని స్థాయిల్లో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలిచారని, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ-ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని అన్నారు.

 ఓటమిని ఊహించే..

ఓటమిని ఊహించే..


తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఈ ఓటమిని ముందే ఊహించడం వల్లే చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అడ్డుగా పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపించారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత నియమితులైన నీలం సాహ్నీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే- ఫలితాలు వెలువడకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఫలితాలు వెలువడటంలో జాప్యం చోటు చేసుకుందే తప్ప.. విజయంలో మాత్రం తేడా ఏమీ లేదని కొడాలి నాని అన్నారు.

అడుగు బయట పెట్టకుండా..

అడుగు బయట పెట్టకుండా..

తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. అడుగు బయట పెట్టకుండా పార్టీకి 90 శాతానికి పైగా ప్రజలు ఓటు వేసేలా.. పరిపాలనను సాగిస్తున్నారని చెప్పారు. జగన్ పాలన జనరంజకంగా సాగుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను ప్రజలు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారని, అది చూసి సహించలేకే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని చెప్పారు.

వారంతా తిరుగుబాటు అభ్యర్థులా..

వారంతా తిరుగుబాటు అభ్యర్థులా..

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీడీపీకి 21 వేలకు పైగా ఓట్ల పోల్ అయ్యాయని, తమ పార్టీకి 89 వేల ఓట్లు పడ్డాయని గుర్తు చేశారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే.. కుప్పం నియోజకవర్గానికి చెందిన ప్రజలు తమ పార్టీకి ఓటు వేసినట్టేనా అని ప్రశ్నించారు. టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే.. ఆ పార్టీ తరఫున 800 నుంచి 900 మంది గెలిచారని, వారంతా తిరుగుబాటు అభ్యర్థులా అని కొడాలి నాని ప్రశ్నించారు. వారందరినీ సస్పెండ్ చేస్తారా? అని సవాల్ విసిరారు.

 వారిని అధ్యక్షుడిగా నియమించుకోండి..

వారిని అధ్యక్షుడిగా నియమించుకోండి..

చంద్రబాబు దిక్కుమాలిన, పనికి మాలిన నాయకుడు కావడం వల్లే ఆయన ఎన్నికలను బహిష్కరించినా.. వారంతా పోటీ చేసి, గెలిచారా? అని అన్నారు. చంద్రబాబు ఎన్నికల పోరు నుంచి పారిపోతే.. ఆ పార్టీ తరఫున గెలిచిన వారు ధైర్యంగా పోటీ చేశారని చెప్పారు. ఆ గెలిచిన ఎంపీటీసీల నుంచో లేదా జెడ్పీటీసీల నుంచో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని కొడాలి నాని సూచించారు. పారిపోయే చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా తొలగించి.. ధైర్యంగా ఎన్నికల పోరాటంలో నిలిచి, గెలిచిన వారిని నియమించుకోవాలని అన్నారు.

బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నేత

బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నేత

తనను తెలుగుదేశం పార్టీ నాయకులు బూతుల మంత్రిగా విమర్శించడాన్ని కొడాలి నాని తప్పుపట్టారు. తాను బూతులు తిడతానని బూతుల మంత్రిగా చెబుతున్నారు సరే.. బూతులు తిట్టించుకుంటోన్న ప్రతిపక్ష నాయకుడిని ఏమని పిలవాలని ఆయన ప్రశ్నించారు. తాను బూతుల మంత్రిని అయితే..చంద్రబాబు బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నాయకుడు అవుతాడని ఎద్దేవా చేశారు.

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే..

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే..

చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిచాడంటే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. చంద్రబాబు బూట్లు తుడుస్తానని, ఆయన కాళ్ల వద్ద కూర్చుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు పెద్ద పోటుగాడే అయితే కుప్పంలో రాజీనామా చేయమనండి అని అన్నారు. మంగళగిరిలో తన కుమారుడు నారా లోకేష్‌ను కూడా గెలిపించుకున్నాడని ఎద్దేవా చేశారు.

  Manda krishna said the only one to hold a Dalit empowerment conference to divert public attention
  అయిదు లక్షల మెజారిటీతో

  అయిదు లక్షల మెజారిటీతో

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అయిదు లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచి, తన సత్తా ఏమిటో అటు ప్రజలకు, ఇటు కాంగ్రెస్ పార్టీకి చూపించాడని అన్నారు. అదే తరహాలో చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గానికి రాజీనామా చేసి, మళ్లీ గెలిచి, లక్ష లేదా లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో గెలవాలని చెప్పారు. అధికార పార్టీని రాజీనామా చేయమనడం ఏమిటని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తరువాత వైఎస్ జగన్.. తాను గెలవడమే కాకుండా.. తనకు అండగా నిలిచిన వారిని కూడా గెలిపించుకున్నారని అన్నారు. చంద్రబాబు కూడా అదే తరహాలో పోటీ చేసి.. తాను గెలిచినా చాలని అన్నారు కొడాలి నాని. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆయన బూట్లు తుడుస్తానని, క్లాత్ కూడా దగ్గరే పెట్టుకుంటానని చెప్పారు.

  English summary
  AP's Civil supplies minister Kodali Nani slams TDP leader Chandrababu and Nara Lokesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X