ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే.. అలా చేస్తే విద్యార్థుల పరీక్షా ఫలితాలు రద్దు!
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది. 2026 మార్చిలో నిర్వహించబడే ఎస్ఎస్సి, ఓ ఎస్ ఎస్ సి పరీక్షలతో పాటు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చిలో నిర్వహించబడే పరీక్షలకు విద్యార్థులు ప్రిపరేషన్ సమర్థవంతంగా ప్రణాళికబద్ధంగా చేసుకోవడానికి వీలుగా ముందుగానే టైం టేబుల్ ను ప్రకటించింది.
ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్
ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు మార్చి 16 2026 ను ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షలన్నీ ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ముగ్గులు ముగుస్తాయి. ముఖ్యంగా ప్రధాన పేపర్ల పరీక్షలు ఈ సమయంలో జరుగుతాయి.

పదవతరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా
షెడ్యూల్ ప్రకారం మార్చి 16వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 18వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20వ తేదీన ఇంగ్లీషు పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23వ తేదీన, సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ మార్చి 25వ తేదీన, బయోలాజికల్ సైన్స్ మార్చి 28వ తేదీన నిర్వహిస్తారు. ఇక సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 31వ తేదీన ఉంటుంది.
ఓఎస్ఎస్సి, ఒకేషనల్ పరీక్షల నిర్వహణ
ప్రధాన పరీక్షల తర్వాత మార్చి 31వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు, ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో పాటు, ఎస్ఎస్సి , ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలను నిర్వహిస్తారు. సైన్స్ పరీక్షలతో పాటు ఒకేషనల్ కోర్సులు వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం పరీక్ష ముగింపు సమయం 11.30నిమిషాల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు.
విద్యార్థులకు సూచనలు
ఇక ssc పరీక్షల నిర్వహణ పైన విద్యాశాఖ బోర్డు కొన్ని కీలక సూచనలను కూడా చేస్తోంది. అకాడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్సి వారికి, ఓ ఎస్ఎస్సి విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని విద్యా శాఖ పేర్కొంది. పరీక్ష సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్న పత్రాన్ని అడిగి తీసుకోవాలని బోర్డు సూచిస్తోంది.

ఈ విషయంలో జాగ్రత్త, అలా చేస్తే వారి ఫలితాలు రద్దు
పొరపాటున ఎవరైనా తప్పుడు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాస్తే వారి ఫలితాలు రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, తాము ఏ పరీక్ష రాస్తున్నామో ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని తీసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా 2026 లోబడి ఈ పరీక్షా షెడ్యూల్ ఉన్నట్టుగా పేర్కొంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications