AP Schools : ఆగస్టు 16నే పునఃప్రారంభం- హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ఏపీలో కరోనా కారణంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా దీనిపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆగస్టు 16న పాఠశాలలు తెరుస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలో కరోనా కారణంగా గతేడాది ఏప్రిల్లోనే పాఠశాలలు మూతపడ్డాయి. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో వచ్చే నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 12న నుంచి విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయకుండా స్కూళ్లు ప్రారంభించవద్దంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

ap schools re-opeining on august 16 : state government told high court

Recommended Video

    Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

    రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయకుండా స్కూళ్లు ప్రారంభిస్తుండంపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భఁగా ప్రభుత్వం తన అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఉపాధ్యాయులకు 60 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, త్వరలో మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్లు వేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 16 న స్కూళ్లు ప్రారంభమవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+