బాబు షార్ట్ లిస్ట్: రాజధాని రేసులో 8 కన్సార్టియంలు, 3 నెలల్లో...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ రెండో వారంలో రాజధాని నిర్మాణ ప్రాజెక్టును ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ముఖ్య కన్సల్టెన్సీల వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలకల్పన సంస్థ పలు కంపెనీల వివరాలను సేకరించి అందులో ఎనిమిదింటిని షార్ట్ లిస్ట్ చేసింది. ఆయా సంస్థలను బిడ్ వేయవల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. తమ తమ ప్రాజెక్టుల వివరాలు, టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ సమర్పించాలని సూచించింది. దీని ద్వారా ఒకే అయిన కంపెనీ రాజధాని కోసం పని చేయనుంది.

ఇది రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయనుంది. తొమ్మిది నెలల్లో ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది కన్సార్టియంలు సింగపూర్ సీనియర్ మంత్రి ఎస్ ఈశ్వరన్‌ని కూడా కలవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ దేశాల సహకారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే. ఆ దేశాలు కూడా రాజధాని విషయంలో సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ రెండో వారంలో కన్సార్టియంను ఫైనలైజ్ చేయనున్నారని తెలుస్తోంది.
మూడు నెలల్లో రాజధాని
మూడు నెలల్లో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలిపారు. రాజధాని నిర్మాణానికి అమెరికా డిఫెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబుతో అమెరికన్ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ భేటీ అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications