విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవిపై తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు-ఆశించలేదు- రాని వాళ్ళకు బాధే..

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజాగా జరిగిన కేబినెట్ ప్రక్షాళనలో అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు బెర్త్ లభిస్తుందని భావించినా సాధ్యం కాలేదు. కులాలు, జిల్లాలు, పాత, కొత్త సమీకరణాల్లో తమ్మినేనికి ఆశాభంగం తప్పలేదు. అయితే దీనిపై స్పందించిన తమ్మినేని ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన స్పీకర్ తమ్మినేని.. తానేప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదన్నారు.
జగన్ కు తాను సమస్య కాకూడదన్నారు. ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి సిద్దంగా ఉన్నట్లు తమ్మినేని తెలిపారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనను కచ్చితంగా గెలుచి రావాలన్నా అని జగన్ గతంలో చెప్పారని తమ్మినేని గుర్తు చేసుకున్నారు. కానీ అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చారు.

ap speaker tammineni key comments on cabinet reshuffle, not expected minister post

గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్పీకర్ గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు జగన్ ఇబ్బంది పడ్డారంటూ తమ్మినేని గుర్తు చేసుకున్నారు. తనకు ఎటువంటి ఇబ్బంది లేదు సర్ అని చెప్పి బాధ్యత తీసుకున్నా అంటూ గుర్తు చేసారు. ప్రస్తుత మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందని తమ్మినేని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారన్నారు. మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

బీసీలు టీడీపీకి ఎప్పుడో దూరం అయ్యారని తమ్మినేని తెలిపారు. భవిష్యత్తులో బీసీ ఉద్యమ కెరటం వస్తుందని, సామాజిక న్యాయం విప్లవంలో టిడిపి కొట్టుకుపోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. డిపాజిట్లు కూడా రాకుండా పోతారు. రాసి పెట్టుకోండంటూ టీడీపీ నేతల్ని ఉద్దేశించి తెలిపారు. స్పీకర్ గా కాదు, బీసీ నాయకుడిగా చెబుతున్నా అన్నారు.
సీతారాం కు మంత్రి అని పత్రికలు రాశాయని, కాని తాను మాత్రం ఆశించలేదన్నారు. స్పీకర్ గా అప్పగించిన బాధ్యత ను గౌరవంగా భావించానని తమ్మినేని తెలిపారు. మంత్రి వర్గ కూర్పులో జగన్ సాహస నిర్ణయం తీసుకున్నారని అనేక మంది తనకు ఫోన్లు చేసి చెప్పారన్నారు. వెనుబడిన వర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారని తమ్మినేని వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు‌ చూశామని, రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారన్నారు. మాజీ హోంమంత్రి సుచరిత రాజీనామా లేఖ తనకు రాలేదని తమ్మినేని తెలిపారు. వైసీపీలో పూర్తి ప్రజా స్వామ్యం ఉంది కాబట్టే చాలామంది తమ అభిప్రాయం ఓపెన్ గా చెప్పారన్నారు. స్పీకర్ గా చేసిన వాళ్లు గెలవలేదని అంటున్నారని, వచ్చే ఎన్నికలలో గెలిచి చరిత్ర ను తిరిగి రాస్తానని తమ్మినేని జోస్యం చెప్పారు. తన నియోజకవర్గం లో గెలవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయమన్నారు. సభకు స్పీకర్ గా ఉన్నా... తన నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యేనే అన్నారు. టీడీపీ వాళ్లకు జగన్ ను విమర్శించే అర్హత లేదని తమ్మినేని తెలిపారు.

English summary
ap assembly speaker tammineni sitaram on today made interesting comments on cabinet reshuffle and his minister post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X